Homeఎంటర్టైన్మెంట్Surekha Vani: కూతురు కోసం లగ్జరీ కారు కొన్న సురేఖా వాణి... రూపాయి సంపాదన లేకున్నా...

Surekha Vani: కూతురు కోసం లగ్జరీ కారు కొన్న సురేఖా వాణి… రూపాయి సంపాదన లేకున్నా తగ్గని భోగాలు!

Surekha Vani
Surekha Vani

Surekha Vani: ఒకప్పుడు సురేఖా వాణి బిజీ యాక్ట్రెస్. లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస చిత్రాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సురేఖా వాణి హవా తగ్గింది. ఆమెకు అడపాదడపా ఆఫర్స్ మాత్రమే వస్తున్నాయి. కొత్త సరుకు నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్న సురేఖా వాణి సిల్వర్ స్క్రీన్ పై అరుదుగా కనిపిస్తున్నారు. బహుశా ఆమెకు తగ్గ పాత్రలు లేకనేమో కానీ మేకర్స్ పక్కన పెట్టేశారు. ఈ విషయాన్ని సురేఖా వాణి నేరుగా ఒప్పుకుంది. ఆ మధ్య ఓ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న సురేఖా వాణి తన అసహనం బయటపెట్టింది.

అందరూ సినిమాలు ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు. అవకాశాలు ఇస్తే కదా చేయడానికి. దర్శక నిర్మాతలు నన్ను పట్టించుకోవడం మానేశారు. గతంలో మాదిరి ఆఫర్స్ ఇవ్వడం లేదు. నేను మాత్రం ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం అన్నారు . సిల్వర్ స్క్రీన్ మీద మిస్ అయినా సోషల్ మీడియాలో సురేఖా వాణి అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సురేఖా వాణి ఓ లగ్జరీ కారు కొన్నారు. కొత్త కారు డెలివరీ తీసుకుంటూ సురేఖా వాణి, కూతురు సుప్రీత ఫోజులిచ్చారు. ఎమ్ జి కంపెనీకి చెందిన ఖరీదైన కారును వీరు సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలో కొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పెద్దగా సంపాదన లేని సురేఖా వాణికి లగ్జరీ కార్లు ఎక్కడ నుండి వస్తున్నాయని అంటున్నారు. దీని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సురేఖా వాణి రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నారు. కారు కొనుక్కుంనేత సేవింగ్స్ ఆమె వద్ద లేకుండా ఉండవు కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Surekha Vani
Surekha Vani

ఇక సిల్వర్ స్క్రీన్ పై తన జోరు తగ్గిన నేపథ్యంలో సుప్రీతను రంగంలోకి దించాలని సురేఖా వాణి ప్లాన్. సుప్రీతను హీరోయిన్ చేయాలని సురేఖా వాణి భావిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళికలు వేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క సినిమాలో నటించకుండానే సుప్రీత ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామరస్ ఫోటో షూట్స్, హాట్ వీడియోలు షేర్ చేస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Oktelugu Epaper