Sri Satya Elimination: శ్రీ సత్య ఎలిమినేషన్..ఇన్ని రోజులు ఎలా కొనసాగిందో అంటూ ట్రోల్ల్స్ వేస్తున్న నెటిజెన్స్

Sri Satya Elimination: బిగ్ బాస్ సీజన్ 6 మరో రెండు రోజుల్లో ముగియబోతుంది..21 మంది కంటెస్టెంట్స్ తో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, నేడు శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వడం తో 5 కంటెస్టెంట్స్ కి చేరుకుంది..శ్రీహాన్ , రేవంత్ , రోహిత్ , ఆది రెడ్డి మరియు కీర్తి టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు..వీరిలో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి..ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బుధవారం అర్థరాత్రి వరుకు కొనసాగిన ఓటింగ్ లో శ్రీ సత్య కి మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే 50 శాతం తక్కువ ఓట్లు వచ్చాయట.

Sri Satya Elimination
Sri Satya

ఇంత భారీ మార్జిన్ తో తక్కువ ఓట్లు రప్పించుకున్న కంటెస్టెంట్ ఈ సీజన్ కి శ్రీ సత్య నే అని చెప్తున్నారు విశ్లేషకులు..గత వారం లోనే ఇనాయ బదులు ఎలిమినేట్ అవ్వాల్సిన శ్రీ సత్య ఇంత దూరం ఎలా వచ్చిందో అంతుచిక్కడం లేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో కాస్త నిదానంగానే గేమ్ ప్రారంభించింది..ఆ తర్వాత నాల్గవ వారం నుండి ఆమె టాస్కుల పరంగా బాగా ఆడుతూ తన ఆట తీరుని మెరుగుపరుచుకుంది..శ్రీహాన్ మరియు రేవంత్ వంటి ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్స్ తో ఆమె స్నేహం చెయ్యడం కూడా ఇన్ని రోజులు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి గల కారణాలలో ఒకటిగా చెప్పొచ్చు..కానీ శ్రీ సత్య ఎన్నడూ కూడా టాస్కుల పరంగా వెనకబడిన దాఖలాలు లేవు..ప్రతీ టాస్కు లోను ఆమె నూటికి నూరు శాతం తన బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేసింది..గెలవడానికి చివరి నిమిషం వరుకు పోరాడింది.

Sri Satya Elimination
Sri Satya Elimination

 

కానీ శ్రీ సత్య కంటే ఇనాయ కాస్త బెటర్ గేమర్ అవ్వడం..ఆమె ఎలిమినేట్ అవ్వడం వల్ల నెటిజెన్స్ లో శ్రీ సత్య మీద నెగటివిటీ వచ్చింది కానీ..టాస్కుల పరంగా మాత్రం కాదు..ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఆమె ఎప్పుడూ హద్దులు మీరు ప్రవర్తించలేదు..ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం ..బిగ్ బాస్ లోకి అడుగుపెట్టకముందు సీరియల్స్ లో విలన్ గా బాగా రాణించిన శ్రీ సత్య కెరీర్ ఇక నుండి ఎలా ఉండబోతుందో చూడాలి.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

AP Rain Alert: ఏపీకి తీపికబురు.. ఇక అన్నీ మంచి రోజులే

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు అందించింది భారత వాతావరణ శాఖ. జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావం ఏపీతోపాటు ఒడిస్సా పై అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల మందగమనం కనిపిస్తోంది....

AP land allotment: ప్రైవేటు సంస్థలకు ఉచితంగా ప్రభుత్వ భూమినా? నిజమెంత?

AP land allotment: ప్రభుత్వ భూములకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు గాను కేటాయించే భూములను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి ఆ భూమిపై పూర్తి హక్కులు సంబంధిత యాజమాన్యాల కేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

Two Men Marriage: ఎల్ నినో ఎఫెక్ట్: ఇద్దరు మగాళ్లు పెళ్లిచేసుకున్నారు..!

Two Men Marriage: ఎల్‌నినో ప్రభావం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. అయితే వానదేవుడని ప్రసన్నం చేసుకునేందుకు ఒడిశాలో ఓ గ్రామస్థులు శతాబ్దాల నాటి ఒక వినూత్నఆచారాన్ని పునరుద్ధరించారు. కాల్వలు, చెరువులు ఎండిపోయి, పంటలు పండక అల్లాడుతున్న తరుణంలో, ప్రకృతిని శాంతింపజేయడానికి ఈ...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.