Sri Reddy- Hyper Aadi: నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగితే ఎక్కడో ఒకచోట అవమానం తప్పదు. ఇలా పెద్ద నోరు వేసుకొని వాగే వారిలో ప్రముఖ వివాదాస్పద నటి శ్రీ రెడ్డి ముందు వరసలో ఉంటారు.. సాక్షి ఛానల్ లో ఒకప్పుడు జర్నలిస్ట్ గా పనిచేసి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నం చేసి సక్సెస్ దక్కకపోవడంతో వివాదాలతో కాలక్షేపం చేస్తూ ఈమె పబ్బం గడుపుతోంది..బాగా పాపులారిటీ , క్రేజ్ ఉన్న హీరోలు , హీరోయిన్లు , పొలిటీషియన్స్ పై నోరు పారేసుకుని అటెన్షన్ సంపాదించడమే ధ్యేయంగా శ్రీరెడ్డి ముందుకెళుతోంది.

ఈమె మాట్లాడే కొన్ని మాటలు చూస్తే అసలు ఈమె నిజంగా అమ్మాయేనా అనే అనుమానం రాక తప్పదు..గతంలో ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఎలా నోరు పారేసుకుందో అందరం చూసాం.. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని మీద.. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ , రానా దగ్గుపాటి ఇలా ఎందరినో టార్గెట్ చేసింది.. ఇప్పుడు లేటెస్ట్ గా ఈమె జబర్దస్త్ పాపులర్ కమెడియన్ హైపర్ ఆదిని టార్గెట్ చేసింది.
ఈమధ్యనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు.. ఈ ఫంక్షన్ కి తన జబర్దస్త్ కుటుంబం మొత్తాన్ని ఆహ్వానించింది రోజా.. అందువల్ల హైపర్ ఆది కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు.. అందరూ జగన్ గురించి బాగా గొప్పగా మాట్లాడుతారు కానీ హైపర్ ఆది మాత్రం చాలా తక్కువ మాట్లాడుతాడు.. అందుకు శ్రీ రెడ్డి తాజాగా హైపర్ ఆది పై రెచ్చిపోయింది.

శ్రీరెడ్డి మాట్లాడుతూ ‘హైపర్ ఆది..నీ కుక్క బుద్ది మళ్ళీ చూపించావు.. అంత పెద్ద ఫంక్షన్ లో జగన్ గురించి మాట్లాడవా..నువ్వు ఎమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావా..ఇష్టం లేనప్పుడు ఏ మొహం పెట్టుకొని అక్కడికి వచ్చావు..నిన్ను కాదు,నిన్ను పిలిచినా రోజా ని అనాలి ముందు.. అతను లేకపోతే ఈవెంట్ జరగదా?, ఎందుకు పిలిచారు..వాళ్ళు పిలిచారో అనుకో సిగ్గు లేకుండా నువ్వు ఎలా వచ్చావు, అంటే డబ్బులిస్తే ఎంత గడ్డి అయినా తింటావా’ అంటూ హైపర్ ఆది పై రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఇలా జగన్ పై వల్లమాలిన ప్రేమను చూపిస్తూ ఆదిని తిట్టిపోసింది. మరి ఈ వ్యాఖ్యలకు ఆది ఎలా కౌంటర్ ఇస్తాడో చూడాలి మరీ.