Sami Sami: ‘అలవైకుంఠపురములో’ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. బన్నీ-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబరు 17న రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీ ఈ మూవీ వంద కోట్ల మార్క్ దిశగా వెళుతూ ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అక్కడ ఈ మూవీ హిట్ తో బాలీవుడ్లోనూ బన్నీ హవా కొనసాగడం ఖాయంగా కన్పిస్తోంది.
‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటించగా.. సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. సమంత స్పెషల్ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలిచిన సంగతి అందరికి తెల్సిందే. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ రష్మిక మందన్నలపై ఓ రోమాంటిక్ సాంగ్ ను దర్శకుడు అద్బుతంగా చిత్రీకరించాడు.
‘సామీ సామీ’ అంటూ సాగిపోయే ఈ పాటకు థియేటర్లలో ఫ్యాన్స్ ఊగిపోయారు. యూట్యూట్, సోషల్ మీడియాను సైతం ఈపాట షేక్ చేసింది. ‘సామీ సామీ’ పాటను ఇమిటేట్ చేస్తూ ఎంతోమంది సెలబెట్రీలు సోషల్ మీడియాలో తమ ఫ్యాన్ ఫాలోయింగ్ కు పెంచుకునే ప్రయత్నం చేశారు. తాజాగా ఓ గుడిలోని పూజారులు సైతం ‘సామీ సామీ’ పాటను సన్నాయి వాయిద్యంతో వాయించి ఆకట్టుకుంది.
కేరళలోని ఓ గుడిలోని పూజారులు ‘పుష్ప’ మూవీలోని ‘సామీ సామీ’ పాటను సంగీత వాయిదాలతో అందంగా వాయించారు. అక్కడే ఉన్న సందర్శకులు దీనిని వీడియోతీసి నెట్టింట్లో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్తా అందరికీ నచ్చతుండటంతో లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. దేవీశ్రీ సంగీతమంటే ఇదే కాదా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ కన్పించింది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
#SaamiSaami song reach is beyond all expectation..!!
Ita been used in the traditional temple fest as well in Kerala..🙏🙏
A @ThisIsDSP masterpiece..!!#PushpaTheRise #Pushpa #PushpaOnPrime #AlluArjun pic.twitter.com/FgWPCxxAv5
— Arjun 🪓 (@ArjunVcOnline) January 8, 2022
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: See how the song sami sami from pushpa was used video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com