Raashi Khanna: ఆఫర్స్ తగ్గే కొద్దీ హీరోయిన్స్ గ్లామర్ డోస్ పెంచుతారు. వరుస పరాజయాలతో డీలాపడ్డ రాశి ఖన్నా పరువాలతో దర్శక నిర్మాతలకు వల విసురుతుంది. ఓ పబ్లిక్ ఈవెంట్ కోసం రాశి ఖన్నా ధరించి డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. బ్యాక్ లెస్, క్లీవేజ్ షోతో వాతావరణం హీట్టెక్కించింది. రాశి ఖన్నా ఇటు సినిమాలతో పాటు డిజిటల్ సిరీస్ల మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఆమె లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ఫార్జి’. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రాశి సూపర్ హాట్ గ్లామర్ గా దర్శనమిచ్చారు. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఫార్జి క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఫార్జి ట్రైలర్ ఆకట్టుకుంది. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. దొంగనోట్ల మాఫియా నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఫిబ్రవరి 10 నుండి ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఫార్జి లో రాశి ఖన్నా రోల్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. రాశి ఖన్నాకు ఇది రెండో వెబ్ సిరీస్. గతంలో ఆమె రుద్ర టైటిల్ తో ఓ క్రైమ్ సిరీస్ చేశారు. అందులో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు.
ఇక రాశి కెరీర్ టాలీవుడ్ లో ముగిసినట్లే. గత ఏడాది ఆమె రెండు డిజాస్టర్స్ ఇచ్చారు. గోపీచంద్ పక్కా కమర్షియల్, నాగ చైతన్య థాంక్యూ నిరాశపరిచాయి. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె పక్కన పెట్టేశారు. 2019లో విడుదలైన ప్రతిరోజూ పండగే చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో హిట్ లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో రాశి బోల్డ్ రోల్ చేస్తారు. శృంగార సన్నివేశాల్లో నటించారు. ఆ మూవీ పరాజయం చెందడం కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.

ఆ మధ్య వరుసగా తమిళ చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆమె ఫోకస్ బాలీవుడ్ పైకి మళ్ళింది. సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా యోధ చిత్రం చేస్తున్నారు. యోధ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2023 జులై 7న యోధ విడుదల కానుంది. ఈ మూవీ విజయం సాధిస్తే బాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతాయని రాశి ఖన్నా భావిస్తున్నారు. ఆమె ఆశలు ఈ మేరకు నెరవేరుతాయో చూడాలి.