AP Alcohol Sales: ఆంధ్రప్రదేశ్ లో పండుగ పూట మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వానికి ఆదాయం ఘనంగా సమకూరింది. దీంతో సంక్రాంతి పండుగ కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. మద్యం ద్వారా ఆదాయం బాగానే రావడం ప్రభుత్వానికి ఆసరాగా కలిసొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు మద్య నిషేధం చేస్తానని మాటిచ్చారు. కానీ అదే ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో ఇప్పుడు మాట తప్పారు. అంచెలంచెలుగా మద్యం విక్రయాలు విస్తరిస్తున్నారు. ప్రభుత్వానికి ఏటేటా ఆదాయం బ్రహ్మాండంగా వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యనిషేధం గురించి మరిచిపోయారు. ప్రభుత్వానికి మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా ఉందంటే దాంతో ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తూనే ఉంది.

సంక్రాంతి పండగ వేళ ఏపీవాసులు విచ్చలవిడిగా మద్యం తాగేశారు. రాష్ట్రంలో మొత్తం 2.33 కేసుల మద్యం, 83 వేల కేసుల బీర్లు తాగారు. దీంతో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం వచ్చింది. పండుగ కావడంతో ఎంజాయ్ చేసేందుకే అందరు మొగ్గు చూపారు. మూడు రోజుల్లో రాష్ర్టవ్యాప్తంగా రూ.213 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా అత్యధికంగా మద్యం అమ్మకాలు చేసింది. ఇక్కడ దాదాపు రూ.21 కోట్ల మద్యం అమ్ముడైనట్లు అధికారులు గుర్తించారు. తర్వాత స్థానాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలున్నాయి.
సంక్రాంతికి అందరు ఎంజాయ్ మెంట్ కే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే మద్యం అమ్మకాలు ఇంతలా పెరిగాయి. పండగ జోష్ లో మద్యం తాగి కిక్కు లో గడిపారు. దీంతో ప్రభుత్వానికి కూడా మంచి కిక్కు దొరికింది. సంక్రాంతి సందర్భంగా కోడి పందాల శిబిరాల్లోకి భారీగా మద్యం బాటిళ్లు సరఫరా అయినట్లు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారందరు పండగకు సొంతూళ్లకు రావడంతో ఊళ్లన్ని కళకళలాడాయి. కోడిపందాల ఎంజాయ్ లో మద్యం భారీగా తాగారు. దీంతో మంచి ఆదాయం సమకూరింది ప్రభుత్వానికి.

డిసెంబర్ 31న రూ.127 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే సంక్రాంతికి అంతకు రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరగడం విశేషం. మద్యం మంచినీళ్లలా తాగారు. తెలంగాణలోనూ మద్యం అమ్మకాలు భారీగానే ఉన్నాయి. రూ.217 కోట్ల మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండగ రెండు రాష్ట్రాలకు మంచి కిక్కు మాత్రం ఇచ్చింది. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడంతో ప్రభుత్వాలకు మంచి ఆదాయం సమకూరింది. హోటళ్లు, బార్లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడంతోనే ఇంత ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు.