spot_img
Homeఎంటర్టైన్మెంట్Oscar On RRR: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ : ఈ ముగ్గురి కృషి వల్లే అవార్డు...

Oscar On RRR: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ : ఈ ముగ్గురి కృషి వల్లే అవార్డు వచ్చిందా?

Oscar On RRR
Oscar On RRR

Oscar On RRR: ప్రపంచ సినీ అవార్డు వేదికపై తెలుగు సినిమా మెరిసింది. తొలిసారి ఆస్కార్ అవార్డు అందుకొని గర్జించింది. యావత్ దేశ సినీ ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయేలా ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు సొంతం కావడంతో సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ రాజమౌళి నుంచి టెక్నీషియన్ల వరకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఒరిజినల్ కేటగిరీలో ‘నాటు నాటు’ కు అవార్డు రావడంతో కీరవాణి, చంద్రబోస్ లు వేదికపైకి ఎక్కారు. కానీ అసలు ఈ పాట సృష్టికర్త, నటించిన రాజమైళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మాత్రం కిందే ఉండిపోయారన్న చర్చ సాగుతోంది. కానీ ఈ ముగ్గురు చేసిన కృషి అంతా ఇంతా కాదని అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన తరువాత బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటి వరకు ఒకే. కానీ ఇంతటితో ఆగిపోలేదు. సినిమాలో తాము కష్టపడిన విధానాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా కృషి చేశారు. అంటే అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ రిలీజైనప్పటికీ దానిని ప్రతి ప్రేక్షకుడు తెలుసుకునేలా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు విస్తృతంగా ప్రచారం చేశారు. అమెరికాలోని ప్రతీ ఈవెంట్ లో రామ్ చరణ్ ద్వయం మెరిసింది. నాటు నాటు సాంగ్ లో వీరు చేసిన డ్యాన్స్ ను అమెరికాలోని తెలుగువారే కాకుండా ఇతరులు సైతం మెచ్చుకునేలా వీరు ప్రదర్శించారు.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ వివిధ అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అందుకు కారణంగా రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అమెరికాలోనే తిష్ట వేసి ప్రతీ ఈవెంట్ ను అవకాశంగా మలుచుకుని సినిమాతను విస్తృతంగా ప్రచారం చేశారు. రాజమౌళి వేసిన ప్రతీ స్కెచ్ ఆయనకు అనుకూలంగా మారడంతో నాటు నాటు సాంగ్ ప్రపంచ వేదిక మెప్పుపొందిందని అంటున్నారు.

Oscar On RRR
Oscar On RRR

నాటు నాటు సాంగ్ ను చంద్రబోస్ రచించగా.. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అయితే ఆ పాటను అంతర్జాతీయ స్థాయిలో ప్రజాదరణను తీసుకెళ్లడానికి శాయశక్తులగా ఈ ఇద్దరు హీరోలు కష్టపడ్డారు. కొందరు ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ కవల పిల్లలు సైతం వీరిలాగా డ్యాన్స్ చేయరని ప్రశంసించారు. వారన్నట్లుగానే ఇతర వేదికల్లో లైవ్లో ఫర్ఫామెన్స్ చూపించి ప్రపంచ సినీ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా వీరి కష్ట ఫలితమే ఆస్కార్ అవార్డు రావడానికి కారణమైందన్న చర్చ సాగుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper