spot_img
Homeఎంటర్టైన్మెంట్Prem Rakshit Choreographer: మరో ఘనత : ఆస్కార్ వేదికగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ

Prem Rakshit Choreographer: మరో ఘనత : ఆస్కార్ వేదికగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ

Prem Rakshit Choreographer
Prem Rakshit Choreographer

Prem Rakshit Choreographer: నాటు నాటు.. ఇప్పుడు ఏ నోట చూసిన ఇదే పాట.. నలుగురు గుమి గూడిన చోట ఇదే ఆట. అంతలా జనాల మనసుల్లోకి చొచ్చుకుపోయింది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఫలితంగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతవరకు ఒక ఎత్తు అయితే.. డాల్బీ థియేటర్లో నాటు నాటు పాట ఒక ఎత్తు. ఇంతవరకు ఏ పాటకు దక్కని గౌరవం ఈ నాటు నాటుకు దక్కింది.

పాటను ఆలపించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ డాల్బీ థియేటర్లో పాడుతుండగా.. హాలీవుడ్ కు చెందిన డ్యాన్సర్లు నాటు నాటు స్టెప్పులతో డాల్బీ థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. దీంతో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన అతిరథ మహానటులు వారితోపాటు పాదం కదిపారు. ఫలితంగా అటు థియేటర్ లోనే కాకుండా డాల్బీ థియేటర్ లోనూ నాటు నాటు పాట దుమ్మురేపింది.. ముఖ్యంగా హాలీవుడ్ డ్యాన్సర్లు వేసిన డ్యాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్.. హాలీవుడ్ డ్యాన్సర్లకు కూడా శిక్షణ ఇచ్చాడు. కొద్దిరోజులపాటు అమెరికాలోనే మకాం వేసి ఒక ప్రత్యేక స్టూడియోలో వారికి స్టెప్పులు నేర్పించాడు.. ఆ డ్యాన్సర్లు సోమవారం తెల్లవారుజామున జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు.. రాహుల్, కాలభైరవ పాడుతుండగా రెచ్చిపోయి డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు ప్రేమ్ రక్షిత కంపోజ్ చేసిన స్టెప్పులకు హాలీవుడ్ ఫిదా అయింది.

Prem Rakshit Choreographer
Prem Rakshit Choreographer

కేవలం స్టెప్పులు మాత్రమే కాదు సెటప్ కూడా ఆర్ఆర్ సినిమా మాదిరే వేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసుకున్నట్టుగా కాస్ట్యూమ్స్ వేసుకొని హాలీవుడ్ డ్యా న్సర్లు స్టెప్పులతో అదరగొట్టారు. నాటు నాటు పాటకు డాన్సర్లు డ్యాన్స్ వేస్తున్నంత సేపు డాల్బీ థియేటర్ ఊగిపోయింది.. ఈ ప్రదర్శన అనంతరం అకాడమీ అవార్డుల నిర్వహకులు ప్రేమ్ రక్షిత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper