Maharashtra: మన సమాజం మీద సినిమాల ప్రభావం చాలా ఉంటుంది. హీరో ఎలాంటి చొక్కా వేస్తే.. అలాంటి చొక్కా నే యువత వేసుకుంటారు. హెయిర్ స్టైల్ ఎలా మైంటైన్ చేస్తే.. అలాంటి హెయిర్ స్టైల్ ను అనుసరిస్తారు. అయితే ఈ సినిమాలలో చెప్పే మంచి కన్నా చూపించే చెడు ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.. పైగా సినిమాలు తీసే విధానంలో చాలా మార్పులు, నేరాలు, హింస, డబుల్ మీనింగ్ డైలాగులకు దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం.. అవి సమాజం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే దొంగతనం నేపథ్యంలో రూపొందిన తెలుగు సినిమాను ఆదర్శంగా తీసుకొని కొంతమంది దొంగలు ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. వారు చోరీ చేసిన విధానం అచ్చం ఆ సినిమాను దాదాపుగా పోలి ఉంది. వారు దొంగతనం చేస్తున్న తీరు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
సాధారణంగా దొంగలు ఏటీఎంలో చోరీకి పాల్పడితే ఆ మిషన్లను సుత్తి లేదా ఇతర యంత్రాలతో పగలగొడుతుంటారు. అందులో ఉన్న డబ్బులను లాక్కెళ్తుంటారు. కానీ ఈ ఇద్దరు దొంగలు మాత్రం పూర్తిగా విభిన్నం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన జులాయి సినిమాలో సోనూ సూద్ బ్యాంకు దోపిడీకి వెళ్ళినప్పుడు అందులో డబ్బు మొత్తం పెద్ద గొలుసు కట్టి దానిని క్రేన్ సహాయంతో బయటకు లాగి ఎత్తుకు వెళ్తాడు. అయితే ఇలాంటి సీన్ మహారాష్ట్రలో రిపీట్ అయింది. కాకపోతే అది బ్యాంకు దొంగతనం కాదు. ఏటీఎం చోరీ. ఇందులో ప్రత్యర్ధులు, కొట్టుకోవడం లాంటివి ఏమీ లేవు. కానీ డబ్బు బయటకు లాగే సీన్ ను ఏటీఎం మిషన్ లాగేందుకు మక్కికి మక్కి దించేశారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ ప్రాంతంలో ఉన్న ఏటీఎంలో ఇద్దరు దొంగలు కొల్లగొడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరు దొంగలు తమ ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకున్నారు. వారిద్దరూ ఏటీఎంలో డబ్బు దొంగిలించేందుకు వింత విధానాన్ని అనుసరించారు. వారిలో ఒక వ్యక్తి ఏటీఎంలో తాడుతో చాలా గట్టిగా కట్టేశాడు. రెండవ కొలను కారు వెనుక భాగంలో కట్టేశాడు. కారును స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనివ్వగానే ఏటీఎం మిషన్ బయటకు వచ్చేస్తుందని, తద్వారా మిషన్ ను బయటకు ఎత్తుకెళ్లిపోవాలనేది వారి ప్రణాళిక. అనుకున్నట్టే తాడుతో ఏటీఎం ను కట్టేసి, కారుకు తాడును బిగించిన తర్వాత రెండవ దొంగ కారును స్టార్ట్ చేశాడు. అని ఏటీఎం మిషన్ ఉన్న గది డోరు మూసుకొని ఉండటంతో రెండవ దొంగ మొదటి దొంగను తలుపు తీయమని చెప్పాడు. తో రెండవ దొంగ కార్ దిగివచ్చి ఏటీఎం గది తలుపు తీసి అలాగే పట్టుకొని అక్కడే నిలబడ్డాడు. రెండవ దొంగ కారును స్పీడుగా ముందుకు పోనిచ్చాడు. అంతే ఏటీఎం మిషన్ చాలా వేగంగా ముందుకు వచ్చి అది ఉన్న గది తలుపును బద్దలు కొట్టింది. అక్కడే నిలబడి ఉన్న ఆ దొంగ ఆ మిషన్ విసురుకు అక్కడి నుంచి దూరంగా వెళ్లి పడ్డాడు. ఈ సంఘటన మొత్తం ఏటీఎం గదిలో సెట్ చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది.
అయితే ఏటీఎంలో సేఫ్టీ సర్వీస్ అమర్చి ఉండడంతో పోలీసులకు క్షణాల్లోనే సమాచారం అందింది. పోలీసులు వెంటనే అప్రమత్తమయి ఏటీఎం ఉన్నచోటుకు చేరుకున్నారు.. కానీ అప్పటికే ఆ దొంగలు ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు.. వారు ఏటీఎంలో డబ్బు దొంగిలించడంలో విఫలమయ్యారు. సీసీ కెమెరాలో రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. కాగా ఈ వీడియోను రాజాబాబు అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఆ దొంగల క్రియేటివిటీకి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.” వారెవ్వా కారులో వచ్చి ఏటీఎం దొంగతనం చేయడం నేను ఎక్కడా వినలేదు.. చూడలేదు కూడా” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Fast & Furious dekhne ke baad car se ATM tod rahe pic.twitter.com/XRahj82svw
— Raja Babu (@GaurangBhardwa1) September 8, 2023