Mumbai Rain Terror: స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. కాలేజీలు బంద్ పెట్టారు. పరీక్షలు వాయిదా వేశారు. అవసరం ఉంటే తప్ప బయటకి రావద్దని సూచనలు చేశారు. ఇదేదో జమ్మూ కాశ్మీర్ లోనో.. మరో చోటనో కాదు.. మనదేశ ఆర్థిక రాజధానిగా పేరుపొందిన ముంబైలో పై పరిస్థితి నెలకొంది.
ముంబై మహానగరంలో ప్రతి ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తూనే ఉంటాయి. ఈసారి మే నెలలోనే బీభత్సంగా వర్షాలు కురిసాయి. దీంతో జూలై ఆగస్టు నెలలో వర్షాలు కురిసే అవకాశం లేదని ముంబై నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు ముంబై నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొద్దిరోజులుగా మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మొన్నటి నుంచి ముంబైలో వర్షాలు మొదలయ్యాయి. శుక్రవారం ఏకంగా ముంబై మహానగరంలో 245 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. దానికి తోడు విపరీతమైన వరద ముంబై నగరాన్ని వణికిస్తోంది. ముంబై నగరంలోని రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా కింగ్స్ సర్కిల్, దాదర్ రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలు పూర్తిగా నట మునిగిపోయాయి. విక్రోలి ప్రాంతంలో జనకళ్యాణ్ సొసైటీలో ఇద్దరు మరణించారు. శనివారం కూడా అక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: మన దేశ ప్రెసిడెంట్ వర్షంలో.. అదే అమెరికాలో వాళ్ళ ప్రెసిడెంట్ ని వర్షంలో తడవనిస్తారా?
వర్షాల వల్ల ముంబై నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలుచోట్ల రైల్వే ట్రాక్ ల మీదికి నీరు రావడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కీరకమైన రోడ్లు వరద నీటిలో మునిగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. మరోవైపు ఇంకా రెండు రోజులు ముంబై నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి మించి వర్షపాతం నమోదు కావడంతో ముంబై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడం అధికారులను కలవరపాటుకు గురిచేస్తుంది. ముంబై నగరంలో ప్రతి ఏడాది కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈసారి వర్షాలు కురవడం వల్ల ఆశించినంత స్థాయిలో వేడుకలు జరగడం లేదు. గడచిన 24 గంటల్లో విక్ర్ హోలీ లో 248.5, శాంటాక్రాజ్ లో 232.5, సీయోను లో 221, జుహు లో 208, బాంద్రాలో 173, బైకుల్లా లో 150 8.5, టాటా పవర్ చెంబూరులో 127.5, కొలాబాలో 70.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జోరుగా కురుస్తున్న వర్షం వల్ల ముంబై నగరంలోని విమానాశ్రయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఫలితంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
#MumbaiRain#MumbaiRains#SaturdayVibes
Mumbai lashed with 200mm+ rains from last night and roads turned into rivers pic.twitter.com/lB8e6t78hE
— Khan (@Khanmohammed12) August 16, 2025
मुंबई एयरपोर्ट पर अदानी सरकार ने अदानी वॉटर पार्क बनवाया
देखो क्या कमाल नजारा है.. हर तरफ पानी ही पानी!#WahModijiWah #MumbaiRains pic.twitter.com/rAM9ziv43X
— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) August 16, 2025