Pune couple on bike : ఒకప్పుడు శృంగారం అనేది నాలుగు గోడల మధ్య నడిచే యవ్వారం.. చాటు మాటు సరసాలు ఉండేవి. కానీ ఇప్పుడు అంతా ఓపెన్. విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ శృంగారాన్ని కానిచ్చేస్తున్నారు. సపరేట్ గా ‘ఓయో’ రూంలు వచ్చాక ఇక అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇటీవల ఓ హీరోయిన్ కు ఆమె తల్లి ‘జీవితాన్ని ఎంజాయ్ చేయి.. కానీ ప్రొటెక్షన్ వాడు’ అంటూ సలహా ఇచ్చిందంటే సమాజం ఎటుపోతోందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఫూణేలోనూ పట్టపగలు నడిరోడ్డుపైనే ఓ జంట రెచ్చిపోయింది.
మహారాష్ట్రలోని పుణే నగరంలో ఓ యువ జంట బహిరంగంగా చేసిన హద్దు మించిన ప్రణయ ప్రదర్శన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరు బైక్‌పై ప్రయాణిస్తూ రోమాన్స్ చేయడంతో, ఆ దృశ్యాలు ఓ వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
వీడియోలో యువకుడు బైక్ నడుపుతూ ఉండగా, యువతి అతని ముందు కూర్చొని గట్టిగా కౌగిలించుకొని కూర్చొని అతనితో అతుక్కుపోయింది. బైక్ మీదనే రోమాన్స్ చేస్తూ వెళ్లారు. వీరి ప్రవర్తనను చూసి పక్కనే ప్రయాణిస్తున్న వారు వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచబడుతోంది.
పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. “ఇది రోడ్డు మీద ప్రయాణం కాదు, సినిమాకు సెటప్ కాదు” అంటూ కొంతమంది మండిపడుతున్నారు. మరోవైపు, పోలీసులు వీడియోను పరిశీలించి, వారి వాహనానికి జరిమానా విధించే దిశగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.
పబ్లిక్‌లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే కొనసాగితే యువతకు తప్పుడు సందేశం వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
An excessive public display of affection by a couple on a two-wheeler in Pune has sparked widespread attention. A shocking video of the incident has gone viral on social media.#PuneNews #ViralVideo #PublicDisplayOfAffection #TwoWheelerStunt #PDA #CoupleViralVideo #RoadSafety… pic.twitter.com/1Dxd2upIpC
— Pune Mirror (@ThePuneMirror) July 28, 2025