Love couple : సాధారణంగా మనం మెట్రో రైలు ఎందుకు ఎక్కుతాం? అదేంటి ఇది కూడా ఓ ప్రశ్నేనా? అంటారా. అలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు మీరే కాదు.. ఎవరైనా సరే అలాంటి సమాధానమే చెప్తారు. మిగతా చోట్ల ఏమో గాని ఢిల్లీలో మాత్రం కొందరు యువతీ యువకులు కేవలం దానికోసమే మెట్రో ఎక్కుతున్నారు. అసలే వయసులో ఉండటం.. పైగా ఏకాంతాన్ని ఆస్వాదించే చోటు లేకపోవడంతో.. తమ విరహాన్ని మెట్రో రైలులోనే ప్రదర్శిస్తున్నారు. చుట్టూ మనుషులు ఉన్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి.. ముద్దులు, కౌగిలింతలతో మునిగితేలుతున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి వ్యవహారం కొత్తేం కాదు. గతంలో ఇలాంటివి వెలుగు చూడటం.. కొంతమంది వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం.. ఆ వీడియోలను ఢిల్లీ మెట్రో అధికారులు చూసి చర్యలు తీసుకుంటామనడం.. పరిపాటిగా మారిపోయింది.
తాజాగా ఢిల్లీలోని సెక్టార్ 16 మెట్రో స్టేషన్ లో ఓ ప్రేమ జంట ముద్దుల్లో తేలిపోయింది. చుట్టూ మనుషులు ఉన్నారనే కనీస జ్ఞానాన్ని మర్చిపోయి కౌగిలింతలో మునిగిపోయింది. ఈ వ్యవహారాన్ని చూసిన కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఢిల్లీ మెట్రో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందించిన ఢిల్లీ మెట్రో అధికారులు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇలాంటి వ్యవహారాలు తరచూ వెలుగు చూస్తుండడం పట్ల మిగతా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలా వ్యవహరించే వారికి చెప్పి చూసే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుందని ప్రయాణికులు బాబోతున్నారు.
ఇక సెక్టార్ 16 మెట్రో స్టేషన్లో జరిగిన సంఘటనకు సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఇది మెట్రో స్టేషన్ అనుకుంటున్నారా?.. లేక ఓయో రూమ్ అనుకుంటున్నారా? ఇలా ప్రవర్తిస్తే మేము ఎలా ప్రయాణం చేయాలి? ఢిల్లీ మెట్రో రైలు అంటే కదిలే ఓయో హోటల్ అయిపోయింది. ఇలాంటి సంఘటనలు ఎన్ని వెలుగు చూసినప్పటికీ ఢిల్లీ మెట్రో అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదంటూ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
It is not foreign, it is India, it is two lovers seen having an open kiss in the Delhi Metro.#ManishaRani #AmbatiRambabu #LeoHindiPoster #INDvAUS #canadaindia #GameOverDementia #VijayVarma #SaraAliKhan #V7thWin #SlowDancing4thWin #Abhisha #Delhi pic.twitter.com/JRWumrSglW
— (@ArpitaRoy42) September 21, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Love couple kisses in metro station viral video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com