Mhoni Vidente: మూడో ప్రపంచ యుద్ధం. ఈ పేరు వింటేనే అందరిలో భయం. యుద్ధంతో నష్టమే కాని లాభాలు ఉండవు. దీంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి? అందుకు కారణాలు ఉన్నాయా? పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయా? అనే కోణంలో ఇప్పటికే చాలా మంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యద్ధంతో చాలా మంది ప్రపంచం ఎక్కడికి పోతోందో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో యుద్ధం వస్తే ఇక ప్రజలకు మరణమే గతి. అందుకే మూడో ప్రపంచ యుద్ధం వద్దని చాలా మంది నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

క్యూబాకు చెందిన జ్యోతిష్య పండితురాలు మ్హోనీ విడేంటే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం వస్తోందని చెబుతోంది. అందరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీనికి కారణం చైనాయే అవుతుందని వెల్లడిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో భయం పట్టుకుంది. మూడో ప్రపంచ యుద్ధమే వస్తే మానవాళి మనుగడ ప్రమాదంలో పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే యుద్ధం వద్దని ఎంత మంది వారిస్తున్నా చైనా మాత్రం ఆ దిశగా సన్నాహాలు చేస్తోందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read: Fake Universities: దేశంలో 22 ఫేక్ యూనివర్సిటీలు..అక్కడ పట్టాలు చెల్లవు
గతంలో కూడా బల్గేరియాకు చెందిన వంగ బాబా కూడా చెప్పినవి దాదాపు 80 శాతం జరిగాయి. ఇప్పుడు ఈమె మూడో ప్రపంచ యుద్ధం గురించి ఆందోళన కలిగించే విధంగా చెప్పడం చూస్తుంటే ఆ ఛాయలు నిజమేననే బెంగ అందరిలో వస్తోంది. కానీ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇక మానవుల మనుగడ క్లిష్టంగా మారనుంది. ఇప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై వేసిన బాంబుల వల్ల అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అణ్వాయుధాలు ఉన్నందున వాటిని ప్రయోగిస్తే వినాశనమే అని తెలుస్తోంది.

మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా కారణం కాదని చెబుతోంది. చైనాయే ప్రధానంగా మారి యుద్ధం చేసేందుకు సన్నద్ధమవుతుందని తెలుస్తోంది. దీంతో భవిష్యత్ లో మరిన్ని ఉపద్రవాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. అమెరికా, చైనాల వల్లే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని జోస్యం చెబుతోంది. దక్షిణ కొరియా అమెరికాతో చేతులు కలిపితే వియత్నాం, ఉత్తర కొరియా జపాన్ తో జత కడతాయని తెలిపింది. దీంతో అమెరికాను ఓడించేందుకు చైనా తెగించడంతోనే ఉపద్రవం ముంచుకొస్తుందని వెల్లడిస్తోంది.
ఇప్పటికే చైనా తన దురాగాతాలను బయటపెడుతోంది. శ్రీలంక ను తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. పాకిస్తాన్ కూడా చైనాకు వత్తాసుపలకడం ఖాయమే. ఈ నేపథ్యంలో చుట్టు ఉన్న దేశాలను తన వైపు లాక్కొని భారత్ పై యుద్ధ భేరి మోగించాలని చూస్తోందని కొన్ని వాదనలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని జోస్యం చెప్పడం గందరగోళానికి గురి చేస్తోంది. ప్రజల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇక మానవాళి మనుగడకు ముగింపే అని నిపుణులు చెబుతున్నారు.