
Covishield Vaccine: కరోనా సృష్టించిన ఉత్పాతం మామూలుది కాదు. మనుషులకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. క్రమశిక్షణ ఎలా ఉండాలి. పరిశుభ్రత ఎలా పాటించాలి అనే విషయాలపై పాఠాలు చెప్పింది. దీంతో ఆ రెండేళ్ల కాలంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చేయని తప్పులకు శిక్షలు అనుభవించారు. ఇప్పటికి చైనా భారీ మూల్యమే చెల్లిస్తోంది. కరోనా మహమ్మారితో డ్రాగన్ ఇంకా పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మన దేశం కరోనాకు టీకాలతో చెక్ పెట్టింది. టీకాలు తీసుకున్న వారికి ఇక కరోనా ముప్పు ఉండదనే ఉద్దేశంతో అందరు టీకాలు తీసుకున్నారు.
కొవిషీల్డ్ టీకాతో..
మన దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు టీకాలు కరోనా నిర్మూలన కోసం వేశారు. దీంతో అందరు వాటిని తీసుకుని కరోనా నుంచి రక్షణ పొందారు. లేకపోతే ఈ పాటికి చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఇలా కరోనా బారి నుంచి మనల్ని రక్షించుకునేందుకు టీకాలు తీసుకుని ప్రయోజనం పొందాం. కానీ మనం తీసుకున్న టీకాల్లో కొవిషీల్డ్ ప్రమాదకరమైనదని భారత సంతతికి చెందిన బ్రిటన్ వాసి అసీమ్ మల్హోత్రా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వాక్సిన్ తో మనకు గుండెపోటు, పక్షవాతం లాంటివి పొంచి ఉన్నాయని ఆయన వెల్లడించడం గమనార్హం.
ఎంఆర్ఎన్ఏ కంటే..
ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ కంటే అత్యంత ప్రమాకరమైనదని చెబుతున్నారు. ఆస్ట్రిజన్ సంస్థ విడుదల చేసిన వివరాల్లో ఈ మేరకు రోగాల ముప్పు పొంచి ఉందని సూచిస్తున్నారు. బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్ పొందిన వారిలో పదిశాతం మందిలో ఈ లక్షణాలు కనిపించినట్లు వెల్లడిస్తున్నారు. దీంతో కొవిషీల్డ్ తీసుకున్న వారిలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. గుండెజబ్బు, పక్షవాతం వంటి వ్యాధుల ప్రభావం ఉందని చెబుతుండటంతో వాటని తీసుకున్న వారిలో ఆందోళన నెలకొంది.

నిజమెంత?
మల్హోత్ర చెబుతున్న దాంట్లో వాస్తవమెంత అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. కానీ దీనికి ఆయన తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. బ్రిటన్ లో చాలా మంది ఈ టీకాతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటున్నారు. కొవిషీల్డ్ తీసుకున్న అనారోగ్య సమస్యలు వెలుగు చూస్తున్నాయి. కానీ మల్హోత్ర చేస్తున్న వాదనలు కొందరు తప్పుగా భావిస్తున్నారు. దీనిపై వ్యాక్సిన్ పై పరిశోధనలు జరగాల్సిందేనని కొందరు పట్టుబడుతున్నారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.
కొవిషీల్డ్ పై వస్తున్న ఆరోపణల్లో..
మొత్తానికి కరోనా రక్కసిని కంట్రోల్ చేసింది ఈ టీకానే కావడంతో అందరిలో విశ్వాసం పెరిగింది. అమెరికాలో కూడా కరోనా తీసుకున్న వారికి 80 శాతం మందికి గుండె జబ్బుల ముప్పు ఉందని నివేదికలు చెప్పాయి. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ టీకాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత అనేదానిపై చర్చ సాగాల్సిందే. కొవిషీల్డ్ కరోనాను రూపుమాపిన ఔషధంగానే చూస్తున్నారు. ముప్పు కలిగించే టీకాగా ఇప్పటికి కూడా గుర్తించడం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో కరోనా రక్కసిని ఎలా అంతమొందిస్తారో వేచి చూడాల్సిందే.