
Sreemukhi: టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి అందాలకున్న అడ్డు తెరలు తీసేస్తుంది. విచ్చలవిడిగా పరువాల ప్రదర్శన చేస్తూ మతులు పోగొడుతుంది. వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా శ్రీముఖి చోళీ లెహంగాలో గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. ఇక చోళీ శ్రీముఖి పరువాల బరువు మోయలేక ఇబ్బంది పడింది. శ్రీముఖి గ్లామర్ జనాల మైండ్ బ్లాక్ చేయగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం బుల్లితెర మీద శ్రీముఖి టైం నడుస్తుంది. ఐదారు షోలకు యాంకరింగ్ చేస్తూ సత్తా చాటుతుంది. చెప్పాలంటే లెజెండరీ యాంకర్ సుమ కూడా శ్రీముఖి చేస్తున్నన్ని షోలు చేయడం లేదు. మిగతా యాంకర్స్ నెమ్మదించగా… శ్రీముఖి జోరు చూపిస్తుంది. పారితోషికంగా శ్రీముఖి లక్షల్లో ఆర్జిస్తున్నారు.

ఇటీవల శ్రీముఖి హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. పేరెంట్స్ తో పాటు కొత్త ఇంట్లో అడుగు పెట్టారు. శ్రీముఖి అమ్మానాన్న, తమ్ముడితో పాటు ఆ ఇంట్లో ఉంటున్నారు. శ్రీముఖి స్టార్ గా ఎదిగి ఫ్యామిలీ దశ మార్చేశారు. మరో వైపు నటిగా కూడా ఆమె క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. భోళా శంకర్, బాలయ్య 108 చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
అనతికాలంలో ఎదిగిన శ్రీముఖి చాలా మందికి స్ఫూర్తి. పటాస్ షోతో శ్రీముఖి యాంకర్ అయ్యారు. రవితో పాటు ఆ యూత్ ఫుల్ స్టాండప్ కామెడీ షోకి యాంకరింగ్ చేశారు. పటాస్ పర్లేదు అనిపించుకుంది. శ్రీముఖి బుల్లితెర ఆడియన్స్ లో కొంత ఫేమ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు కలిసొచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి రన్నర్ గా నిలిచారు. టైటిల్ కోల్పోయినా మంచి రెమ్యూనరేషన్ రాబట్టారు. ఇక హీరోయిన్ శ్రీముఖి హీరోయిన్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. ఆల్రెడీ శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా నటించారు. భవిష్యత్ లో ఆమెకు మరిన్ని సినిమా ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు.