Shocking News: ఇప్పటి వరకు మీరు ఎన్నో ఆత్మహత్యల కథలు విని ఉంటారు. అబ్బాయి మోసం చేశాడని అమ్మయిలు.. లేదంటే అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకొందరేమో ఇష్టం లేని పెండ్లి చేశారని, మరికొందరేమో సంసారంలో బాధలు భరించలేకపోతున్నామని, పెండ్లాం పెంకిదని, మొగుడు వేధిస్తున్నాడని.. ఇలా అనేక కారణలతో చనిపోయిన వారి గురించి విన్నాం కదా.

అయితే శోభనం అంటే భయపడి చనిపోయిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వినడానికి కొంచె అనుమానంగా ఉన్నా..మేం చెప్పేది నిజమే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. మాచర్ల సాగర్ రింగ్‌రోడ్ సమీపంలో నివసిస్తున్న సత్యనారాయణరాజు, విజయలక్ష్మిల కొడుకు కిరణ్‌కుమార్ (32).
Also Read: Punjab: తెల్లారిన కూలీ బతుకులు.. గుడిసెలో ఏడుగురు సజీవదహనం..!
ఈయనకు గత మార్చి 11న తెనాలి వించిపేటకు చెందిన అమ్మాయితో పెండ్లి అయింది. 12వ తేదీన కొత్త భార్యను తీసుకుని మాచర్లలోని ఇంటికి వచ్చాడు. నాలుగు రోజుల తర్వాత 16వ తేదీన అత్తగారు తెనాలిలో శోభనం ఏర్పాట్లు చేశారు. దాంతో భార్యను తీసుకుని తెనాలి బయలు దేరాడు కిరణ్ కుమార్. ఏమైందో ఏమోగానీ.. గుంటూరు బస్టాండ్‌లో సాయంత్రం 4గంటలకు భార్యతో సహా దిగిన అతను.. నేను ఇప్పుడే వస్తానంటూ చెప్పి వెళ్లిపోయాడు.
ఎంత సేపైనా భర్త రాకపోవడంతో.. అతని బంధువులకు సమాచారం ఇచ్చి ఆమె తెనాలికి వెళ్లిపోయింది.
కానీ రాత్రి అయినా విజయ్ కుమార్ మాత్రం అత్తగారింటికి రాలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. అతని కోసం వెతుకుతున్న సమయంలోనే కృష్ణానది ఒడ్డున ఓ శవం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నీటిలో మునిగిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్టు గుర్తించారు. అప్పటికే పూర్తిగా కుళ్లిపోయింది.

అతని జేబులోని ఫోన్‌లో ఉన్న సిమ్ కార్డు ఆధారంగా కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. విజయ్ కుమార్ తల్లి విజయలక్ష్మి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి శవాన్ని గుర్తుపట్టింది. తన కొడుకేనంటూ బోరున విలపించింది. అయితే శోభనం అనగానే భయపడి ఇలా చేశాడని చెప్పుకొచ్చింది. విజయ్ కుమార్ ఫ్రెండ్స్ ఎంతగా ధైర్యం చెప్పినా భయాన్ని వీడలేదని.. చివరకు ఇలా చేశాడని విలపించింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:CM Jagan Chiranjeevi: సీఎం జగన్ డిమాండ్స్ కి నో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.
Recommended Videos
[…] […]