Homeజనరల్ఏపీలోని ఆ ఊళ్లో పులి పిల్లలంటూ ప్రచారం.. చివరకు..?

ఏపీలోని ఆ ఊళ్లో పులి పిల్లలంటూ ప్రచారం.. చివరకు..?

స్మార్ట్ ఫోన్ల రాకతో సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగింది. ఏ విషయమైనా సోషల్ మీడియా ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా తెలుస్తోంది. అయితే కొందరు ఫేక్ వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం వల్ల ఇతరులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పులి పిల్లలు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. చాలామంది ఆ ప్రచారాన్ని నిజమేనని నమ్మారు.

విషయం ఫారెస్ట్ అధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పులి పిల్లలని చెప్పబడుతున్న వాటిని పరిశీలించి అవి పులి పిల్లలు కాదని అడవి పిల్లి పిల్లలని తేల్చారు. కుక్కునూరు అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న మద్దిగట్ల దగ్గర అడవి పిల్లి పిల్లలు దర్శనమివ్వడం గమనార్హం. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఫోటోలు అడవిపిల్లి పిల్లలని తెలిసి స్థానికులు అవాక్కయ్యారు.

అటవీ శాఖ అధికారులు అడవిపిల్లి పిల్లలను అడవిలో వదిలేశారు. దూరం నుంచి చూస్తే అవి పులి పిల్లల్లా కనిపించాయని అందుకే వాళ్లు కంగారు పడ్డారని వారు పేర్కొన్నారు. కుక్కునూరు పరిసర ప్రాంతాలలో హల్ చల్ చేసిన అడవి పిల్లి పిల్లలు సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలవడంతో గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేశాయని చెప్పవచ్చు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు పలు సందర్భాల్లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

పిల్లి పిల్లలే అయినా చర్మం రంగు పులి పిల్లల్లా ఉండటంతో కొందరు వాటిని పులి పిల్లలని అపోహ పడ్డారు. అయితే పులి పిల్లలని మొదట భయపడిన ప్రజలే ఆ తర్వాత అసలు విషయం తెలిసి నవ్వుకోవడం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper