spot_img
Homeజనరల్నగదు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లిన శవం.. ఏం జరిగిందంటే..?

నగదు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లిన శవం.. ఏం జరిగిందంటే..?

Patna Canara Bank News

సాధారణంగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే బ్యాంకు ద్వారా ఖాతాదారుడు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నామినీకి డబ్బులు విత్ డ్రా చేసుకునే ఛాన్స్ లభిస్తుంది. ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంకు ద్వారా మరో వ్యక్తి డబ్బులు విత్ డ్రా చేసే అవకాశం ఉండదు. అందువల్ల బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నగదును విత్ డ్రా చేయడానికి బీహార్ లో శవం బ్యాంకుకు వెళ్లింది.

Also Read: ‘ఆచార్య’ మూవీలోని మరో రహస్యాన్ని బయటపెట్టిన చిరంజీవి

వినడానికి వింతగా అనిపిస్తున్న ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే పాట్నాలోని సిగ్రియ‌వాన్ అనే గ్రామంలో 55 సంవత్సరాల వయస్సు ఉన్న మహేశ్ అనే వ్యక్తి జీవనం సాగించేవాడు. అతనికి కుటుంబ సభ్యులు, బంధువులు లేరు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మహేశ్ అనారోగ్యం వల్ల మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు అతనికి అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు.

Also Read: కొడాలి నాని కౌంటర్ కు నందమూరి బాలక్రిష్ణ ఎన్ కౌంటర్

అయితే అంత్యక్రియల కోసం కావాల్సిన డబ్బు గ్రామస్తులకు జమ కాలేదు. ఆ సమయంలో గ్రామస్తులు అతనికి కెనరా బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఉందని అతని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేద్దామని బ్యాంక్ మేనేజర్ ను కలిసి అసలు విషయం చెప్పారు. మహేష్ బ్యాంక్ అకౌంట్ లో లక్ష రూపాయలు ఉండగా మహేష్ ఎవరినీ నామినీగా పేర్కొనకపోవడంతో బ్యాంకు మేనేజర్ డబ్బు విత్ డ్రా చేయడానికి అంగీకరించలేదు.

మరిన్ని వార్తల కోసం:జనరల్

దీంతో గ్రామస్తులు శవాన్ని బ్యాంకుకు తీసుకొని వచ్చి బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తే బ్యాంకుకు వచ్చాడని డబ్బు విత్ డ్రా చేసి ఇవ్వాలని కోరారు. మేనేజర్ ఎంత చెప్పినా గ్రామస్తులు వినకపోవడంతో మేనేజర్ తన పర్సనల్ ఖాతాలో 10,000 రూపాయలు విత్ డ్రా చేసి ఇవ్వగా గ్రామస్తులు ఆ డబ్బుతో అంత్యక్రియలు నిర్వహించారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper