spot_img
Homeజాతీయ వార్తలుTelangana CS selection- KCR: కాపులే టార్గెట్.. తెలంగాణ సీఎస్ ఎంపిక వెనుక కేసీఆర్ సీక్రెట్...

Telangana CS selection- KCR: కాపులే టార్గెట్.. తెలంగాణ సీఎస్ ఎంపిక వెనుక కేసీఆర్ సీక్రెట్ ఎజెండా ఇదే..

Telangana CS selection- KCR: ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయాలని డిసైడ్ అయిన కేసీఆర్ ఏ అవకాశాన్ని జార విడుచుకోవడం లేదు. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఏపీలో రాజకీయ లెక్కలు వేసుకునే ఆయన తెలంగాణలో నియామకాలు చేపడుతున్నారన్న టాక్ నడుస్తోంది. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ అకాల నిష్క్రమణతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యంగా మారింది. ఉదయం కోర్టు తీర్పుతో సోమేష్ కుమార్ తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ కు నమ్మకమైన అధికారిగా పేరున్నా.. న్యాయస్థానం ఆదేశాలు పాటించాల్సి రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఏపీ బాట పట్టాల్సి వచ్చింది. అయితే ఆయన స్థానంలో ఎవర్ని నియమించాలని కేసీఆర్ ఆలోచనలో పడ్డారు. చాలా మంది సీనియర్లు ఉన్నా 1989 బ్యాచ్ కు చెందిన శాంతికుమారిని ఎంపిక చేశారు. ఈ ఎంపిక వెనుక ఏపీలో కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

Telangana CS selection- KCR
Telangana CS selection- KCR

తెలంగాణలో తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నిలిచారు. 2019 వరకూ ఆమె సీఎంవోలో సెక్రెటరీగా ఉన్నారు. ఆరోగ్య, పరిశ్రమల శాఖను పర్యవేక్షించేవారు. చాలా కీలకంగా వ్యవహరించేవారు. అయితే ఆమెకు సీఎంవో నుంచి ఉన్నపలంగా బదిలీ చేశారు.కొన్నిరోజుల పాటు హెల్త్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అటు తరువాత అటవీ శాఖకే పరిమితం చేశారు. అయితే ఆమె పరిధిలో ఉన్న శాఖ రివ్యూలను శాంతికుమారికి తెలియకుండా చేస్తున్నారని అప్పట్లో ప్రచారం సాగింది. సీనియర్ అధికారిగా ఉన్న అడుగడుగునా అవమాన పరుస్తున్నారన్న టాక్ నడిచింది.అటువంటి మహిళా అధికారికి ఏకంగా సీఎస్ బాధ్యతలు అప్పగించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆమె కంటే సీనియర్లు ఉన్నా శాంతికుమారి వైపే కేసీఆర్ మొగ్గుచూపడానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆమె కేవలం కాపు సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం వల్లే ఆమెకు పెద్దపీట వేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయడంపై పడ్డ కేసీఆర్ కాపు అస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే.

Telangana CS selection- KCR
Telangana CS selection- KCR

ఇలా శాంతికుమారి పేరు ప్రకటించారో లేదో.. సాయంత్రానికి ఏపీ కాపు నేతలు ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, జనసేన సలహాదారుడు అయిన తమిళనాడు మాజీ సీఎస్ ఆర్.రామ్మోహనరావు, పార్ధసారధి తదితరులు కేసీఆర్ ను కలుసుకున్నారు. శాంతికుమారి ఎంపికపై అభినందించారు. తాజా నియామకంతో ఏపీలో బీఆర్ఎస్ కు ఎంతవరకూ ఉపయోగపడుతుందోనని చర్చించారు. దీంతో ఇది పక్కా పొలిటికల్ వ్యూహంతో సాగినట్టు తెలుస్తోంది. అటు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం కాపు సామాజికవర్గాన్ని ఏపీలో తనవైపు తిప్పుకునేందుకు సీనియర్లకు కాదని శాంతికుమారిని సీఎస్ బాధ్యతలు అప్పగించడంపై ఐఏఎస్ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. అయితే మున్ముందు ఏపీ రాజకీయాల కోసం ఎన్నెన్నో నియామకాలు జరిపే చాన్స్ ఉందన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో విస్తరిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper