5 Seater Cars: దేశంలో కార్ల వినియోగం పెరుగుతోంది. ఇటీవల కాలంలో ప్రతి కుటుంబం కారు కొనుక్కోవాలని కలలు కంటున్నారు. ఇందులో భాగంగానే వారి కలను నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. లేదంటే అందరు కలిసి ప్రయాణించడం కష్టమే. దీంతో కారు కొనుక్కుని దర్జాగా ప్రయాణించాలని చూస్తున్నారు. దీని కోసమే కార్ల వాడకం పెరిగిపోతోంది. మధ్యతరగతి వారు సైతం కారు వాడాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్ల కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

ఇదే సమయంలో మనకు నచ్చిన కారును కొనుగోలు చేయాలని అందరు భావించడం సహజం. ధర తక్కువగా మన్నిక ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లోబడ్జెట్ లో 5 సీటర్ ఎస్ యూవీ కార్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థలు లు రకాల మోడళ్లు తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. మహేంద్ర థార్ చౌకైన మోడల్ వచ్చింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ ధర రూ.9.99 లక్షలకు అందుబాటులో ఉంది. ఎస్ యూవీకి 1.5 లీటర్ డీజిల్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఏటీ ఇంజిన్ ఇచ్చారు.
జనవరి 14 నుంచి కారు డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రూ.9.99 లక్షలు ఎక్స్ షో రూం ధర మొదటి 10,000 బుకింగ్ లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టాటా నెక్సాన్ ప్రారంభ ఎక్స్ షో రూం ధర రూ. 7.69 లక్షలు. దీని బేస్ మోడల్ 1199 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉండటంతో లీటరుకు 17.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. హ్యుందాయ్ వెన్యూ ఎక్స్ షో రూం ధర రూ.7.62 లక్షల నుంచి మొదలు కానుంది. దీనికి కూడా 1197 సీసీ ఇంజిన్ ఇవ్వబడింది. ఈ మోడల్ ఏడు రంగుల్లో అందుబాటులోకి వస్తోంది.

దక్షిణ కొరియా కంపెనీ కియా సోనెట్ ఎస్ యూవీని అందిస్తోంది. దీని ఎక్స్ షో రూం ధర రూ.7.69 నుంచి ఆరంభం కానుంది. లీటరు పెట్రోల్ తో 18.4 కిలోమీటర్ల దూరం ఇవ్వనుంది. మహేంద్ర ఎక్స్ యూవీ300 ఎక్స్ షో రూం ధర రూ.8.41 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఎస్ యూవీ బేస్ మోడల్ 1197 సీసీ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కలిగి ఉంది. మారుతి బ్రెజ్జా దీని ఎక్స్ షో రూం ధర రూ.7.99 లక్షలు. దీని బేస్ మోడల్ 1492 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది.