Groundwater: టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఇంకా మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు ప్రజలు. అయితే బోరు వేయాలంటే ఏ స్థలంలో వేస్తే మంచిది అక్కడ నీళ్లు ఉంటాయా? లేదా అనే విషయాలను తెలుసుకొని మరీ వేస్తారు. కానీ దీనికోసం చేతిలో కొబ్బరికాయ లేదా చెంబులో నీళ్లు పోసి భూగర్భంలో నీటి జాడను తెలుసుకుంటారు. మరి ఇందులో నిజం ఎంత? ఇలా తెలుసుకోవచ్చా? లేదా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నీటి జాడను తెలుసుకోవడానికి సంప్రదాయ పద్దతులను అనుసరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే రైతులు జియాలజిస్టులను పిలిచి నీటి జాడలను కనుగొనడం లేదు..అంత స్థోమత కూడా కొందరికి లేదు. అందుకే ఇటువంటి విధానాలను ఎంచుకుంటున్నారు. కొందరు ఇప్పటికీ భూమిలో నీటి జాడ కోసం కొబ్బరికాయ, లేదా వై ఆకారంలో ఉండే వేప పుల్ల, చెంబు నీళ్లు వంటివి ఉపయోగిస్తారు. అయితే ఇలా శాస్త్రీయ పద్ధతుల ద్వారా నీళ్ల జాడను తెలుసుకోవచ్చు అంటారు కొందరు.
నీళ్లు పుష్కలంగా ఉండే ప్రాంతాల్లో ఎన్ని పద్ధతులు పాటించినా బోర్ వేస్తే నీళ్లు పడుతాయి. అదే కరువు నేల అయితే ఇలాంటి పద్ధతులు తలకిందులు అవుతాయి. శాస్త్రీయ పద్దతులు మాత్రమే కాదు కొన్ని సార్లు జియాలజిస్టుల అంచనాలు కూడా ఫెయిల్ అవుతుంటాయి. చదువుకున్న వాళ్లు శాస్త్రీయ పద్ధతులను వంద శాతం నమ్ముతుంటారు. కానీ అశాస్త్రీయ పద్దతులకు కూడా కారణం లేకపోలేదు. సైంటిఫిక్ గా చూపిస్తే సక్సెస్ రేట్ చాలా ఉంటుంది.
మొత్తం మీద ఈ కొబ్బరికాయల మంత్రం నీరు ఉన్న ప్రాంతాల్లో ఫలిస్తుంది. ఎందుకంటే అక్కడ నీరు కొబ్బరికాయతో కాదు నార్మల్ గా కండ్లు మూసుకొని చెప్పినా ఇక్కడ నీరు పడుతుంది అని చెప్పవచ్చు. అదే కొబ్బరికాయలను నీరు లేని చోటు అడిగితే.. ప్రతి చోట ఇలాంటి రిజల్ట్ వస్తే అప్పుడు నమ్మవచ్చు అంటారు ప్రజలు.