spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss - 7 : బిగ్ బాస్ సీజన్ 7... యాంకర్ రష్మీ, దీపికా పిల్లి...

Bigg Boss – 7 : బిగ్ బాస్ సీజన్ 7… యాంకర్ రష్మీ, దీపికా పిల్లి టోటల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్! ఇక రచ్చ రచ్చే!

Bigg Boss – 7 : బిగ్ బాస్ రియాలిటీ షో పట్ల జనాల్లో భారీ హైప్ ఉంది. గత ఐదు సీజన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. భారీ టీఆర్పీ రాబట్టాయి. సీజన్ 6 మాత్రం నిరాశపరిచింది. పలు కారణాలతో ఈ సీజన్ కి కనీస ఆదరణ దక్కలేదు. అవే పాత గేమ్స్ తో ఇబ్బంది పెట్టారు. కంటెస్టెంట్స్ లో పస లేదు. నాగార్జున హోస్టింగ్ కూడా ఈసారి తేలిపోయిందన్నమాట వినిపించింది. అలాగే కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ నుండి విజేతను నిర్ణయించడం వరకు విమర్శలు వెల్లువెత్తాయి. 

 
సీజన్ 6 వైఫల్యాలను అధిగమించి ప్రేక్షకులను కట్టిపడేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అందులో భాగంగా కొంచెం పేరున్న కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయాలని భావిస్తున్నారట.  ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైందట. ఈ క్రమంలో కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిజంగా వారందరూ హౌస్లోకి వెళితే రచ్చ రచ్చే అని చెప్పొచ్చు. 
 
ప్రచారం అవుతున్న లిస్ట్ ప్రకారం… సీరియల్ నటుడు అమర్ దీప్, అతని భార్య, యాంకర్ దీపికా పిల్లి, రష్మీ గౌతమ్, నటి ఐశ్వర్య, యూట్యూబర్ నిఖిల్, సింగర్ హేమచంద్ర, నటి మిత్రా శర్మ, డాన్సర్ శ్వేతా నాయుడు, ట్రాన్సజెండర్ తన్మయి, మోడల్ సాయి రోనక్, న్యూస్ రీడర్ ప్రత్యూష,  సింగర్ మోహన భోగరాజు,  సింగర్ మంగలి, కామన్ మాన్ కేటగిరీలో పల్లవి ప్రశాంత్, ఎంపికయ్యారట. 
 
ప్రచారంలో ఉన్న ఈ లిస్ట్ దాదాపు ఖాయమే అంటున్నారు. మరి హోస్ట్ సంగతి ఏంటనే మాట వినిపిస్తోంది. నాగార్జున హోస్టింగ్ గత సీజన్లో విమర్శలపాలు కాగా ఆయననే కొనసాగిస్తారా? లేదంటే కొత్త హోస్ట్ ని రంగంలోకి దించుతారా? అనేది చూడాలి. రానా, బాలకృష్ణ వంటి స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పట్ల మేకర్స్ ఆసక్తిగా ఉన్నా ఆయనకు తీరిక లేదు. జులై చివరి వారం లేదా ఆగస్టు ప్రారంభంలో బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవుతుందని అంటున్నారు
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper