Homeఎంటర్టైన్మెంట్2022 Tollywood Roundup: 2022 రౌండప్: టాలీవుడ్ లో కనిపించని హీరోలెవరు?

2022 Tollywood Roundup: 2022 రౌండప్: టాలీవుడ్ లో కనిపించని హీరోలెవరు?

2022 Tollywood Roundup: గత ఏడాది సూపర్ హిట్స్ ఇచ్చిన బాలకృష్ణ, అల్లు అర్జున్, అఖిల్ ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. వారు ఏడాది లోపు మరో సినిమా చేయలేకపోయారు. ఒకప్పటి హీరోలు సంవత్సరానికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అత్యధికంగా ఒకే ఏడాది 18 సినిమాలు విడుదల చేశారు. ఆనాటి కథలు, పరిస్థితులు, నిర్మాణ విలువలు దానికి సహకరించేవి. అందుకే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వందల కొద్ది సినిమాలు చేశారు. ఈ జనరేషన్ లో అలా సినిమాలు చేసే హీరోలే లేరు. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న స్టార్స్ ని పక్కన పెడితే టైర్ టు హీరోలు కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయలేకపోతున్నారు.

2022 Tollywood Roundup
Allu Arjun, Balakrishna

ఈ విషయంలో చిరంజీవి, రవితేజ, వెంకటేష్ బెటర్ అని చెప్పాలి. నెలల వ్యవధిలో వీరు రెండు చిత్రాలు విడుదల చేశారు. చిరంజీవి 2022లో ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సిద్ధం చేశారు. ఆచార్య ఏప్రిల్ లో విడుదల కాగా… ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు ఆయన విడుదల చేసినట్లు. రవితేజ సైతం ఈ ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ విడుదల చేశారు. నేడు ధమాకా చిత్రంతో థియేటర్స్ లో దిగాడు. 2022లో మూడు సినిమాలు విడుదల చేసిన ఏకైక హీరో రవితేజ.

అలాగే వెంకటేష్ నటించిన ఎఫ్ 3, ఓరి దేవుడా చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. నాగార్జున ది ఘోస్ట్ అంటూ దుమ్ములేపే యాక్షన్ పంచారు. ఇక గత ఏడాది సూపర్ హిట్స్ ఇచ్చిన బాలకృష్ణ, అల్లు అర్జున్ ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. 2022లో వారి నుండి ఒక్క సినిమా రాలేదు. 2021 డిసెంబర్ లో వీరిద్దరూ సందడి చేశారు. అఖండ, పుష్ప చిత్రాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్నారు. అఖండ బాలకృష్ణ కెరీర్లో మెమరబుల్ హిట్ అని చెప్పాలి. వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలయ్యను హిట్ ట్రాక్ ఎక్కించిన మూవీ అఖండ.

2022 Tollywood Roundup
Akhil Akkinen

ఇక పుష్ప సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాన్ ఇండియా విజయం సాధించిన పుష్ప వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ కి ఎనలేని ఫేమ్ తెచ్చిపెట్టింది. బాలయ్య వీరసింహారెడ్డి, అల్లు అర్జున్ పుష్ప 2 ఈ ఏడాది విడుదలవుతాయని ఫ్యాన్స్ భావించారు, కానీ జరగలేదు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో కెరీర్లో ఫస్ట్ హిట్ నమోదు చేశాడు అఖిల్. ఆయన లేటెస్ట్ మూవీ ఏజెంట్ 2022లో థియేటర్స్ లో దిగుతుంది అనుకుంటే అది జరగలేదు. ఇక సాయి ధరమ్ తేజ్ లాస్ట్ మూవీ రిపబ్లిక్ విడుదలై ఏడాది దాటిపోయినా ఆయన నుండి మరో మూవీ రాలేదు. ప్రమాదానికి గురైన సాయి ధరమ్ విరామం తీసుకోవడంతో 2022లో ఆయన నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
Oktelugu Epaper