Homeటాప్ స్టోరీస్Pawan Kalyan Telangana Comments: తెలంగాణ మీ అయ్య జాగీరా.. పవన్ ప్రశ్నించింది అందుకే..

Pawan Kalyan Telangana Comments: తెలంగాణ మీ అయ్య జాగీరా.. పవన్ ప్రశ్నించింది అందుకే..

Pawan Kalyan Telangana Comments: తెలంగాణ రాష్ట్రంలో ఆమధ్య పవన్ కళ్యాణ్ సృష్టించిన రాజకీయ అలజడి కలకలం రేపింది. ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరిగింది. కొంతమంది తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పవన్ కళ్యాణ్ నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలోకి ఎందుకు వద్దని అంటున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. పవన్ […]

Pawan Kalyan Telangana Comments: తెలంగాణ రాష్ట్రంలో ఆమధ్య పవన్ కళ్యాణ్ సృష్టించిన రాజకీయ అలజడి కలకలం రేపింది. ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరిగింది. కొంతమంది తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

పవన్ కళ్యాణ్ నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలోకి ఎందుకు వద్దని అంటున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు.. భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కొంతమంది నాయకులు.. టిఆర్ఎస్ అధినాయకురాలు కవిత, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవహారశూరి సరైనది కాదని మండిపడ్డారు.

నాడు తెలంగాణ మీ అయ్య జాగీరా అని తాను ఎందుకన్నాను.. దానికి దారి తీసిన పరిస్థితులను పవన్ కళ్యాణ్ వివరించారు. “నన్ను హైదరాబాద్ రాకూడదని కాంగ్రెస్ నాయకులు పదే పదే బెదిరించారు. తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. 13 నెలలుగా టార్గెట్ చేశారు. నాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టారు. మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించాను. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఈ వైఖరి లేదని.. నన్ను రావద్దు అంటే రాహుల్ గాంధీ సౌత్ ఇండియాతో తనకు సంబంధం లేదని చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ తో పోటీ వల్లే తెలంగాణ మీద ఫోకస్ పెట్టడం అనేది అబద్ధమని” పవన్ పేర్కొన్నారు.

“నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. స్కూల్ రికార్డ్స్ లో శ్రీ అనే పదం తొలగించి కే కళ్యాణ్ కుమార్ అనే పేరు నమోదు చేశారు. మార్షల్ ఆర్ట్స్ టీచర్స్ నా పేరుకు ముందు పవన్ అని పేరు పెట్టారు. నా చాతి భాగం మీద 450 కిలోల స్టోన్ స్లాబ్స్ బ్రేక్ చేసేవారు. నన్ను హనుమంతుడితో పోల్చుతూ ఆ పేరు పెట్టారని” పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ నేతలు ఇంతవరకు స్పందించలేదు. చూడాలి మరి వారు ఏం మాట్లాడతారో.. గతంలో పవన్ కళ్యాణ్ మీద అనిరుధ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper