Homeఎంటర్టైన్మెంట్Alia Bhatt Alpha Teaser: దుమ్ములేపుతున్న అలియా భట్ 'ఆల్ఫా' టీజర్.. ఇందులో జూనియర్ ఎన్టీఆర్...

Alia Bhatt Alpha Teaser: దుమ్ములేపుతున్న అలియా భట్ ‘ఆల్ఫా’ టీజర్.. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ రోల్?

Alia Bhatt Alpha Teaser: బాలీవుడ్ స్పై జానర్ సినిమాలకు కేవలం నార్త్ ఇండియా లో మాత్రమే కాదు , సౌత్ ఇండియా లో కూడా మంచి క్రేజ్ ఉంది. షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి వారు ఈ స్పై జానర్ సినిమాల్లో నటించి , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ స్పై యూనివర్స్ నుండి వచ్చిన చివరి చిత్రం ‘వార్ 2’. హృతిక్ […]

Alia Bhatt Alpha Teaser: బాలీవుడ్ స్పై జానర్ సినిమాలకు కేవలం నార్త్ ఇండియా లో మాత్రమే కాదు , సౌత్ ఇండియా లో కూడా మంచి క్రేజ్ ఉంది. షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి వారు ఈ స్పై జానర్ సినిమాల్లో నటించి , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఈ స్పై యూనివర్స్ నుండి వచ్చిన చివరి చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరో గా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా , ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లోనే అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమా గా నిల్చింది ఈ చిత్రం. దీంతో ఈ యూనివర్స్ కి ఇక ఎండ్ కార్డు పడినట్టే అని అంతా అనుకున్నారు.

కానీ ‘వార్ 2’ మూవీ చివర్లోనే , ఈ యూనివర్స్ నుండి ‘ఆల్ఫా’ అనే చిత్రం తెరకెక్కబోతుంది , ఒక చిన్నపాటి క్లిప్ హ్యాంగర్ సన్నివేశం తో చెప్పకనే చెప్పాడు డైరెక్టర్. ఈ సినిమాలో అలియా భట్ ప్రధాన పాత్ర పోషించబోతుంది. ఆమెకు గురువుగా బాబీ డియోల్ నటిస్తున్నాడు. శర్వరి స్పై ఏజెంట్ ఆఫీసర్ గా నటించబోతుంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ని నేడు ఉదయం విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్పై యూనివర్స్ కి ‘వార్ 2’ తో ఎండ్ కార్డు పడిందని అనుకున్నాం , కానీ ‘ఆల్ఫా’ చిత్రం స్పై యూనివర్స్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

ఈ టీజర్ లో బాబీ డియోల్ తన కూతురు కి 18 ఏళ్ళు నిండగానే , దేశం కోసం ఒక సీక్రెట్ ఆపరేషన్ ని అందించడం , అందుకోసం ఆమెని చిన్నప్పటి నుండి ఆయన ఎలా తయారు చేసాడు వంటి షాట్స్ ఈ టీజర్ లో ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. అయితే ఈ సినిమాలో హ్రితిక్ రోషన్ కబీర్ గా కనిపించబోతున్నాడట. ఇది కేవలం అతిధి పాత్ర మాత్రమే, హ్రితిక్ రోషన్ తో పాటు , జూనియర్ ఎన్టీఆర్ కూడా మేజర్ విక్రమ్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ ఇద్దరి హీరోల అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఈ ఏడాది జులై 3 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఈ టీజర్ ని మీరు కూడా చూసేయండి.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper