YCP
YCP: వైసీపీలో టిక్కెట్ల రగడ చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో దుమారం రేగుతోంది. చాలామంది పార్టీ హై కమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు. మరికొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా వైసీపీని వీడేందుకు ఇద్దరు ఎంపీలు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వీరికి టికెట్ విషయంలో హై కమాండ్ నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో పార్టీని వీటడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ ఇద్దరి ఎంపీలు టిడిపి నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దాదాపు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎంపీ సీటు తన కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. అందుకు జగన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ జగన్ వారి డిమాండ్లను పట్టించుకోవడం లేదు. ఒంగోలు ఎంపీ సీట్లు తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి జగన్ ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మాగుంట శ్రీనివాస్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లి పోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు టిడిపి నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు టిడిపి నుంచి ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు తిరిగి టిడిపి గూటికి చేరుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా దాదాపు వైసీపీని వీడి ఎందుకు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు. ముక్తసరిగా, పార్టీని వీడేందుకు సాకులు చూపే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. ఆయన మరోసారి నరసరావుపేట ఎంపీ స్థానాన్ని కోరుకుంటున్నారు. కానీ జగన్ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని చెబుతున్నట్లు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అయితే అధినేత ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని ఆయన ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయల విషయంలో వైసీపీ హై కమాండ్ చాలా విషయాల్లో అనుమానంగా చూసింది. అవమానపరిచిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అందుకే పార్టీని వీటడమే మేలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈయన వైసీపీని వీడితే మాత్రం టీడీపీ గూటికి చేరతారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ ఇద్దరు ఎంపీలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Those two mps will give a shock to ycp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com