Kodali Nani : ఏపీ రాజకీయాల్లోనే( AP state politics) ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani). అనవసరంగా తన వ్యాఖ్యలతో వివాదాస్పద ముద్ర వేసుకున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచారు కొడాలి నాని. అందులో రెండుసార్లు టిడిపి నుంచి.. మరో రెండు సార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. వ్యక్తిగత కామెంట్లు సైతం చేసేవారు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో కొడాలి నాని కి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అంతా భావించారు. అయితే ఇటీవల ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ పయనమయ్యారు.
Also Read : ఇదీ తెలంగాణ అంటే.. అసెంబ్లీలో నిలువెల్లా ప్రజాస్వామ్య స్ఫూర్తి!
* కొద్ది రోజుల కిందట అస్వస్థత..
కొద్ది రోజుల కిందట కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఏఐజి( Hyderabad AIG Hospital) ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం గుండెకు సంబంధించిన రుగ్మతగా గుర్తించారు వైద్యులు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు నేతలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను స్టార్ ఆసుపత్రికి మార్చినట్లు సమాచారం. ఇంతలో గుడివాడకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాని కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో మారు పరీక్షలు నిర్వహించాక ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలా? లేకుంటే స్టంట్స్ వేయాలా? అన్నది తేల్చనున్నారు.
* ధ్రువీకరించిన వైయస్సార్ కాంగ్రెస్..
అయితే కొడాలి నాని గుండెపోటుకు గురైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆయన అనుచరుడు శశిభూషణ్ ( Shashi Bhushan )మాత్రం గ్యాస్టిక్ ట్రబుల్ అంటూ చెప్పుకొచ్చారు. గుండెపోటు అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. అయితే అక్కడకు ఒక్కరోజు తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా డాక్టర్లతో మాట్లాడారు. గుండెపోటు అని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసింది. అప్పటినుంచి కొడాలి నాని అభిమానులతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన టెన్షన్ నెలకొంది.
* ఆందోళనలో అభిమానులు..
అయితే కొడాలి నాని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి( YSR Congress ) అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గత కొంతకాలంగా కొడాలి నాని రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి పరామర్శించేందుకు వచ్చారు. కానీ జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బయట ఉండిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనలో ఫైర్ తగ్గలేదని సంకేతాలు ఇచ్చారు. అటు తరువాత ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు.
Also Read : అదిరేటి డ్రెస్ తో ఆకట్టుకున్న జగన్!