Recording dances in Pithapuram
Pithapuram : పిఠాపురం.. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సాధారణ నియోజకవర్గం. 2024 ఎన్నికల ప్రచారంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి(Jagan mohan Reddy).. అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగ గీత(Vanga Geetha)ను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానని ప్రకటించారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో పిఠాపురానికి గుర్తింపు వచ్చింది.
Also Read : పవన్ కళ్యాణ్ దారెటు?
పిఠాపురం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pavan Kalyan) ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. 2024 ఎన్నికలకు ముందు వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లల కిడ్నాప్‌లు, అత్యాచారాలు, అదృశ్యాలు, వలంటీర్ల పై ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కానీ, అదృశ్యమైన ఒక్క యువతి, మహిళను తిరిగి తీసుకురాలేదు. ఇక మహిళలంటే తనకు ఎంతో గౌరవం అన్నట్లు మాట్లాడిన జనసేనాని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న లైంగిక దాడులు, అదృశ్యాలు, కిడ్నాప్‌ల గురించి కనీసం పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. కనీసం ఖండించడం లేదు. ఇక కిడ్నాప్ అయారని గతంలో ఆయన చెప్పిన ఒక్కరిని కూడా తిరిగి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. పైగా ఇప్పుడు తన నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు పెట్టించినా పట్టించుకోడం లేదు. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని యు. కొత్తపల్లి మండలం, మూలపేట గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా జరిగిన రికార్డింగ్ డాన్సు(Recording dance)లు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఈ డాన్స్ కార్యక్రమంలో 12 మంది అమ్మాయిలు యువతను రెచ్చగొట్టే పాటలకు, మత్తెక్కించే నృత్య హంగులతో అర్థరాత్రి వరకు ప్రదర్శన ఇచ్చారని సమాచారం. సంప్రదాయ జాతరలో ఇటువంటి కార్యక్రమాలు చోటు చేసుకోవడం స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
మండిపడుతున్న స్థానికులు..
అది డిప్యూటీ సీఎం నియోజకవర్గం.. రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి. కానీ, పరువు తీసేలా పండుగల వేళలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతున్నారు. ఇంతటి అశ్లీల నృత్యాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కన్నెత్తి చూడకపోవడం పట్ల వారు అసంతృప్తి చెందుతున్నారు. ‘ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి ఎలా ఇస్తారు? దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?‘ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన గురించి అధికారిక సమాచారం స్పష్టంగా లేనప్పటికీ, స్థానికుల ఆందోళన ఈ విషయం యొక్క తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది.
పోలేరమ్మ జాతర..
పోలేరమ్మ జాతర సంప్రదాయకంగా గ్రామ దేవతకు సమర్పితమైన ఒక భక్తి ఉత్సవం. ఈ సందర్భంగా పూజలు, ఆచారాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అయితే, రికార్డింగ్ డాన్సుల వంటి ఆధునిక అంశాలు సంప్రదాయ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ నాయకుడి నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదంపై అధికారులు ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. పోలీసులు లేదా స్థానిక పరిపాలన ఈ ఘటనను ఎలా సమర్థిస్తారు లేదా దీనిపై ఏ చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాజకీయ, సామాజిక చర్చలకు దారితీయవచ్చు. స్థానికులు ఈ విషయంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read :బైరెడ్డికి కీలక బాధ్యతలు.. అనుబంధ విభాగాలపై జగన్ ఫోకస్!
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Pithapuram recording dances in pithapuram
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com