Homeఆంధ్రప్రదేశ్‌Telugu Desam Party : 43 ఏళ్ల టిడిపి ప్రయాణం అజరామరం.. ఆవిర్భావం నాడు ఆకట్టుకుంటున్న...

Telugu Desam Party : 43 ఏళ్ల టిడిపి ప్రయాణం అజరామరం.. ఆవిర్భావం నాడు ఆకట్టుకుంటున్న వీడియో!

Telugu Desam Party : దేశంలోనే ప్రాంతీయ పార్టీలకు( regional political parties ) దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. పార్టీ ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే అధికారంలోకి రాగలిగింది. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. వెండితెర ఇలవేల్పు మార్చి 29, 1982లో పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడ 9 నెలల్లోనే అధికారాన్ని అందుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ప్రతి ఘట్టం కీలకమే. అది మొదలు గత 42 సంవత్సరాలుగా ఎన్నో కష్టనష్టాలను అధిగమించి ఆ పార్టీ నిలబడగలిగింది. ఉమ్మడి ఏపీ తో పాటు అవశేష ఆంధ్రప్రదేశ్ లో బలమైన ఉనికి చాటుకుంటూ వచ్చింది.

Also Read : రాష్ట్రం ఏర్పడ్డాక 11 ఏళ్లకు ఆంధ్రాలో సెటిల్ అవుతున్న బాబు

* చంద్రబాబు చతురతతో..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు( Nandamuri Taraka Rama Rao ) అయినా.. ఆ పార్టీకి ఎక్కువగా భుజం మోసింది మాత్రం చంద్రబాబు. పార్టీ అధినేతగా సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. కష్టంలో ఉన్న ప్రతిసారి పార్టీని విజయ తీరం వైపు నడిపించారు. అయితే దానికి ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదులే కారణం. ఎన్టీఆర్ తన బలమైన పునాదులతో పార్టీని నిలబెట్టగా.. దానిని సుదీర్ఘకాలం నడిపించగలిగారు మాత్రం చంద్రబాబు. ఒక ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు కొనసాగడం అంటే చిన్న పని కాదు. కానీ దాన్ని సాధ్యం చేసి చూపించారు చంద్రబాబు. విపత్కర పరిస్థితుల్లో పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు.. అదే చిత్తశుద్ధితో నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి నడిపిన ఘనత ఆయనదే.

* సంక్షోభాలను అధిగమించి..
ఈరోజు తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) 43వ పడిలో పడింది. 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అనేక సంక్షోభాలను చవిచూసింది. కిందకు పడిన ప్రతిసారి అంతే వేగంతో మీదకు వచ్చింది. బలమైన ప్రతాపం చూపింది. ఎన్టీఆర్ పార్టీకి దిక్సూచి అయితే.. మూడు దశాబ్దాల పాటు ముందుకు తీసుకెళ్లిన ఘనత మాత్రం చంద్రబాబుదే. ఎన్నెన్నో అపవాదులు, ఆరోపణలు వచ్చిన మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు చంద్రబాబు. ఆ పార్టీకి కర్త,కర్మ, క్రియ అంతా చంద్రబాబు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ అలసిపోలేదు. అపజయం వచ్చిందని తప్పించుకోలేదు. అదే తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకోవడానికి ప్రధాన కారణం అయ్యింది.

* మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో వేడుకలు..
నేడు టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. మంత్రి లోకేష్( Minister Lokesh) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు, పార్టీ ముఖ్యులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక వీడియో ఆకట్టుకుంటోంది. 1982 మార్చి 29న ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి సీఎం చంద్రబాబు అభివృద్ధి అజెండా వరకు, నారా లోకేష్ యువకులం వరకు వివిధ ప్రత్యేక ఘట్టాలను ఈ వీడియోలో పొందుపరిచారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శతకోటి వందనాలు అంటూ.. 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ సాగిన ఈ వీడియో.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రదర్శించారు. నేతలు వివిధ చారిత్రక ఘట్టాలను తిలకించి 43 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని గుర్తు చేసుకున్నారు.

Also Read : చంద్రబాబుకు పాదాభివందనం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular