Pithapuram Varma: పిఠాపురం వర్మ( Pithapuram Varma) వైయస్సార్ కాంగ్రెస్ టచ్లోకి వెళ్లారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారా? గత కొద్దిరోజులుగా దీని పైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. తాజాగా ముద్రగడ పద్మనాభం కుమార్తె ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వర్మ వైయస్సార్ కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లి పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఏమైనా ఉంటే టిడిపి హై కమాండ్ తో తేల్చుకోవాలని వర్మకు సూచించారు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి. కొద్ది రోజుల కిందటే ఆమె జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జనసేనలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం తండ్రిని ఆమె విభేదించారు.
* మారిన పరిణామాలు.
గత కొద్ది రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు( politics) శరవేగంగా మారిపోతున్నాయి. గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు వర్మ. చంద్రబాబు ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకోవడమే కాదు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. అయితే ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం వర్మ కృషి చేశారు. వర్మ కృషిని పవన్ కళ్యాణ్ సైతం అభిమానించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరిగింది కానీ.. వర్మకు మాత్రం పదవి దక్కలేదు. దీంతో ఆయనలో ఒక రకమైన అసంతృప్తి ఉంది.
* నాగబాబు కామెంట్స్ తో కాక
మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం పిఠాపురంలో వర్మను దూరం పెడుతూ వచ్చింది జనసేన( janasena ). ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో పవన్ గెలుపు ఎవరి కృషి కాదని పరోక్షంగా వర్మకు గట్టి సంకేతాలు పంపారు నాగబాబు. అటు తర్వాత పూర్తిగా సీన్ మారింది. అప్పటినుంచి జనసేన వర్సెస్ వర్మ అన్నట్టు పరిస్థితి ఉంది. తనకు పదవి రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని వర్మ అనుచరుల వద్ద బాధపడుతున్నారు. టిడిపి సోషల్ మీడియాలో సైతం ఇదే ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు పిఠాపురం నియోజకవర్గంలో వర్మ విస్తృత పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. అయితే అది పవన్ కళ్యాణ్ కు చెక్ చెప్పేందుకేనని టాక్ నడుస్తోంది.
* వర్మ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు..
ఇటువంటి పరిస్థితుల్లో ముద్రగడ కుమార్తె, జనసేన నేత క్రాంతి( Kranti) సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు చేశారు. వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం కారణం కాదని తేల్చి చెప్పారు. అది టిడిపి సొంత వ్యవహారమని చెప్పుకొచ్చారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని వర్మపై ఆరోపించారు. మీ వ్యాఖ్యలతో కూటమి పార్టీలో విభేదాలు ఏర్పడుతున్నాయని వర్మకు గుర్తు చేశారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం కుమార్తె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వర్మగారూ మీ వైఖరి మార్చుకోండి
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే @SVSN_Varma కి పదవి రాకపోవడానికి డిప్యూటీ సీఎం @PawanKalyan గారు కారణం కాదు. అది @JaiTDP పార్టీ సొంత వ్యవహారం. మీరూ మీరు తేల్చుకోవాలి. @JanaSenaParty పై అక్కసు వెళ్లగక్కడం ఎంతమంత్రం తగదు. బహుశా మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు…
— Kranthi Barlapudi (@kr_barlapudi) March 28, 2025