spot_img
Homeటెలివిజన్‌Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 హౌస్లో భార్యాభర్తల రొమాన్స్... ఈసారి ఏకంగా...

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 హౌస్లో భార్యాభర్తల రొమాన్స్… ఈసారి ఏకంగా రెండు జంటలు? మాసాలా కంటెంట్ ఇచ్చేందుకు గట్టి ప్లాన్స్!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం రంగం సిద్ధమవుతుంది. త్వరలోనే సరికొత్త సీజన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్ డిజైన్ వంటి పనులు పూర్తయినట్లు సమాచారం. ఆగస్టు మొదటి వారంలో షో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 పై ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఈ నయా సీజన్ కి సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వస్తుంది.

ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే .. బుల్లితెర పై అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న షో గా బిగ్ బాస్ నిలిచింది. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. సీజన్ 6 రేటింగ్ పడిపోవడంతో ఉల్టా పుల్టా అంటూ కొత్త కాన్సెప్ట్ తో సీజన్ 7 తీసుకువచ్చారు. ఫలితంగా గత సీజన్ సూపర్ సక్సెస్ అయింది. ఒక సామాన్యుడు విజేత కావడం హైలెట్ అయింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్నాడు. సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి రన్నర్ గా నిలిచాడు. మొదటి నుండి టైటిల్ విజేత అనుకున్న శివాజీ.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఆ జోష్ లో ఇప్పుడు సీజన్ 8 ని మరింత విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కాంట్రవర్సీల్లో ఉన్న సెలబ్రిటీల పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట. సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న యూట్యూబర్స్ పై కూడా మేకర్స్ దృష్టి పెడుతున్నారట. తాజా సమాచారం ప్రకారం… ఎనిమిదవ సీజన్లో రెండు జంటల్ని తీసుకువస్తున్నారట. గతంలో భార్యాభర్తలైన వితికా – వరుణ్ సందేశ్ ని జంటగా హౌస్ లోకి పంపించారు. అలాగే సీజన్ 6లో సీరియల్ నటి మెరీనా తన భర్త రోహిత్ తో పాటు షోలో పాల్గొంది.

లేటెస్ట్ సీజన్లో ఏకంగా రెండు జంటలు ఎంట్రీ ఇస్తాయని అంటున్నారు. పైగా వాళ్లకు స్పెషల్ రూమ్స్ కూడా కేటాయిస్తారు అని సమాచారం. ఇందులో నిజమెంత ఉందో తెలియదు. కానీ నెట్టింట మాత్రం వైరల్ గా మారింది. హౌస్లో మసాలా కంటెంట్ కోసమే ఈ ప్లాన్ అంటున్నారు. జంటల మధ్య ముద్దులు, హగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎటూ భార్యాభర్తలే కాబట్టి పెద్దగా విమర్శలు తలెత్తే అవకాశం ఉండదని మేకర్స్ ఆలోచన అట.

ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బర్రెలక్క, కుమారి ఆంటీ, రీతూ చౌదరి, రాజ్ తరుణ్, హేమ, సురేఖ వాణి, బంప్చిక్ బబ్లు, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్ వంటి సెలెబ్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అనూహ్యంగా వేణు స్వామి సైతం హౌస్లో అడుగుపెడుతున్నారట. ఇటీవల కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వేణు స్వామికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. అలాగే వరుసగా ఆరో సీజన్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారని సమాచారం.

బిగ్ బాస్ సీజన్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండగా మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా సంప్రదాయవాదులు బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తున్నారు. బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా వేశారు. మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాగార్జున సైతం ఎన్ని విమర్శలు వచ్చినా హోస్టింగ్ బాధ్యతల నుండి తప్పుకోవడం లేదు. అందుకు కారణం బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper