Anchor Swetcha Case Twist: పాత్రికేయురాలు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ఇప్పటివరకు పూర్ణచంద్రరావు మీద స్వేచ్ఛ కూతురు అరణ్య, ఆమె తండ్రి శంకర్ సంచలన ఆరోపణలు చేశారు. స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిసిన తర్వాత అరణ్యను కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆమె మరిన్ని సంచలన విజయాలను చెప్పింది. దీంతో పూర్ణచంద్రరావు మీద అందరికీ ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. అతని ప్రవర్తన తీరు మీద ఎవగింపు కలుగుతున్నది.
Also Read: రుతుపవనాల విస్తరణ.. కుమ్మేస్తున్న వాన!
ఇక స్వేచ్ఛ కేసు విషయంలో ఆరోపణులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శనివారం రాత్రి పూర్ణ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం అతడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పూర్ణను విచారించాల్సి ఉందని పోలీసులు కోరడంతో న్యాయమూర్తి సమ్మతం వ్యక్తం చేశారు. అతడిని విచారించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. ఈ లోగానే స్వేచ్ఛ కూతురు అరణ్య, తండ్రి శంకర్, తల్లి శ్రీదేవి మరిన్ని నిజాలు చెప్తున్నారు. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.
పూర్ణ మీద తీవ్రస్థాయిలో అభియోగాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతడి భార్య స్వప్న ఓ వీడియో ద్వారా బయటికి వచ్చింది. ఆ వీడియోలో స్వప్న చెప్పిన వివరాలు విభిన్నంగా ఉన్నాయి..” నమస్కారమండి. నా పేరు స్వప్న.. పూర్ణ భార్యను. అరణ్య చెప్పిన విషయాలు నాకు ఇబ్బంది కలిగించాయి. అందువల్లే వాస్తవాలు చెప్పడానికి బయటికి వచ్చాను.. అరణ్యను పూర్ణ మా బిడ్డలాగే చూసుకున్నాడు. ఆమెకు స్కూల్ ఫీజులు చెల్లించాడు. ఇటీవల పూర్ణతో కలిసి దిగిన ఫోటోలను స్వేచ్ఛ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పటినుంచి మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. నేను ఆయనకు దూరంగా ఉంటున్నాను. అంతకుముందు స్వేచ్ఛ పూర్ణకు తరచూ ఫోన్ చేసేది. మేము ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా సరే అతడితో మాట్లాడేది. వాళ్ళందరినీ వదిలిపెట్టి నా వద్దకు రావాలి అని పూర్ణకు చెప్పేది. పూర్ణ ఫోన్ ఎత్తకపోతే నాకు ఫోన్ చేసేది. నన్ను ఇబ్బంది పెట్టేది.. నాకు విడాకులు ఇవ్వమని చెప్పేది. మనిద్దరం కలిసి ఉందామని పూర్ణతో అనేది.. ఇవన్నీ నాకు తెలిసి పూర్ణతో గొడవపడ్డాను. పూర్ణ మాత్రం అలాంటిది ఏమీ లేదని నాతో అనేవాడు.. స్వేచ్ఛ చనిపోయిన తర్వాత అరణ్య, శంకర్ మాట్లాడుతున్న మాటలు ఇబ్బంది కలిగించి ఇలా మీడియా ముందుకు వచ్చాను.. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అరణ్య చెప్పేదాంట్లో నిజం లేదు. పూర్ణ నా పిల్లల్ని స్వేచ్ఛ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు.. నన్ను అమ్మ అని పిలవాలి అని నా పిల్లలతో అనేది. ఆ విషయం నా కూతురు చెప్పింది. అరణ్యను నా పిల్లలు అక్క అక్క అని పిలిచేవారట.. ఈ విషయం కూడా నా కూతురు చెప్పింది. అరణ్య విషయంలో ఒక తండ్రి లాగా ప్రవర్తించిన పూర్ణ.. ఆమెతో అసభ్యంగా వ్యవహరించాడంటే నమ్మే విధంగా లేదు. ఇదంతా కూడా పూర్ణపై జరుగుతున్న కుట్ర అని” స్వప్న వెల్లడించింది. దీంతో స్వేచ్ఛ ఆత్మహత్య వ్యవహారం మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మీడియాకు వీడియో విడుదల చేసిన పూర్ణచందర్ భార్య స్వప్న
స్వేచ్చ కూతురు మా ఆయన మీద వేస్తున్న నిందలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను.
ఆమెను పూర్ణచందర్ సొంత బిడ్డలా చూసుకున్నారు. స్వేచ్చ నన్ను కూడా చాలా టార్చర్ పెట్టింది.
స్వేచ్చ కూతురికి అలా చెప్పమని ఎవరు చెప్తున్నారో నాకు… https://t.co/WoyNsd0MoQ pic.twitter.com/CE9sX6amun— ChotaNews App (@ChotaNewsApp) June 30, 2025