Six Crore Event Andhra Pradesh: అది మామూలు తిండి కాదు.. ఒక్కో ప్లేట్లో 200 వెరైటీలు.. టిఫిన్ల నుంచి మొదలుపెడితే స్వీట్ల వరకు.. ఫ్రూట్స్ నుంచి డిసర్ట్స్ వరకు… ఇలా ప్రతి ఒక్కటి అద్భుతమే. వెల్కమ్ డ్రింక్ అవకాడో ఇచ్చారు. టిఫిన్లలో తట్ట ఇడ్లీ నుంచి ఉప్మా పెసరట్టు వరకు.. నాన్ వెజ్ లో చికెన్ నుంచి మటన్ వరకు.. ఇలా తిన్న వాళ్లకు తిన్నంత.. అన్నట్టుగా ఆ ఫంక్షన్ సాగిపోయింది.
ఇంతలా సాగిపోయిన అ ఫంక్షన్ పెళ్ళికాదు.. పేరంటం అంతకంటే కాదు.. ఇది జరిగింది ఇక్కడ విదేశాలలో కాదు.. మన ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో.. ఇంత ఆడంబరంగా జరిగిన ఈ ఫంక్షన్ ఓణీల వేడుక.. దీనికోసం పెట్టిన ఖర్చు అక్షరాల ఆరు కోట్లు. మెయిన్ కోర్స్ కోసమే ఒక బుక్ లెట్ ప్రింట్ చేశారంటే.. ఆ వేడుకను ఏ స్థాయిలో చేశారో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆడి పాడేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. వెండి కంచాలలో భోజనాలు వడ్డించారు.. వెల్కమ్ థీమ్ కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. పూల డెకరేషన్ అయితే.. ఒక రేంజ్ లో ఉంది.
కేవలం మెయిన్ కోర్స్ మాత్రమే కాదు.. టిఫిన్స్.. స్నాక్స్ కూడా ఒక రేంజ్ లో పెట్టారు. ఐస్క్రీమ్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు. పీచు మిఠాయి.. అవకాడో జ్యూస్ ఇక్కడ ప్రత్యేకంగా నిలిచాయి. మినప వడలు.. సున్ని ఉండలు.. కారపు పొడులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వెరైటీలను అందించారు. 200 వెరైటీలతో ఫుడ్ సర్వ్ చేశారంటే మామూలు విషయం కాదు..
ఇంతటి స్థాయిలో చేసినందుకు దాదాపు 6 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.. ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. కొందరేమో డబ్బు బాగా ఎక్కువ కావడంతో బలిసి కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరేమో తమ తాహతు తగ్గట్టుగా ఖర్చుపెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ఖర్చులు తగ్గించుకోవాలని.. బంగారాన్ని తక్కువ కొనుగోలు చేయాలని.. ఇతర ఆడంబరాలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు. కొందరేమో ఆ మాటలను పట్టించుకుంటుంటే.. మరికొందరేమో ఏమాత్రం లెక్కపెట్టడం లేదు.. ఇలా 6 కోట్లు పెట్టి ఓణీల ఫంక్షన్ చేశారంటే మామూలు విషయం కాదు. డబ్బున్న వాళ్లకు ఈ ఆరు కోట్లు ఒక లెక్కా.
