Janasena Aruna: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ దిష్టి. ఈ దిష్టి అనే పదం దయ నందిని జీవితంలో చాలా సార్లు వింటుంటాం. అయితే ఇది పాజిటివ్ గానూ కనిపిస్తుంది.. నెగిటివ్ గానూ వినిపిస్తుంది. అంతలా ఉంది దీని ప్రభావం. పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది వివాదం అయింది. వారం రోజుల కిందట అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆ సందర్భంలో మాట్లాడుతూ కొబ్బరి పంటల నష్టం జరగడంతో కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందేమోనని వ్యాఖ్యానించారు. అది మొదలు తెలంగాణ నేతలకు టార్గెట్ అయ్యారు. కెసిఆర్ పార్టీ నేతలు దీనిని బయటకు తీయగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు దానిని మరింత ముందుకు తీసుకెళుతున్నారు. పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం అని చూడకుండా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై జనసేన నేతలు సైతం ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో జనసేన నేత రాయపాటి అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.
* జనసేన ప్రకటన..
తెలంగాణ నుంచి పవన్ పై విమర్శలు రావడంతో జనసేన నాయకత్వం స్పందించింది. ఒక ప్రకటన జారీ చేసింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించారని అందులో పేర్కొంది. అయినా సరే దీనిపై విమర్శలు ఆగడం లేదు. తెలంగాణ సమాజం పెద్దగా పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకో దీనిపై సీరియస్ గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ సెంటిమెంట్ కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలు చేసిందన్న భావన వ్యక్తం అవుతోంది. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా ఏకంగా అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలను నిలిపివేస్తామని హెచ్చరించడం మాత్రం సంచలనంగా మారింది. దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు. గతంలో ఎంతో మంది ఇలా శపధం చేసి మట్టిగట్టుకుపోయారని.. కాంగ్రెస్ పార్టీ ఒక లెక్క అన్నట్టు మాట్లాడుతున్నారు.
* జనసేన నేత రియాక్షన్..
తాజాగా జనసేన నేత రాయపాటి అరుణ దీనిపై స్పందించారు. తెలుగు ప్రజలు రకరకాల రూపంలో దిష్టి తీస్తుంటారని.. చిన్నపిల్లలకు దిష్టి తగులుతుందని భావించి దిష్టి తీస్తుంటారని.. అలానే పవన్ కళ్యాణ్ సందర్భోచితంగా మాట్లాడారని చెప్పుకొచ్చారు అరుణ. కాంగ్రెస్ నేతల మాటలు చూస్తుంటే మాత్రం దిష్టి అనే పేరును బ్యాన్ చేయవలసి వస్తుందేమోనని అన్నారు. పనికిరాని వాళ్లు అంటూ ఓకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ చల్లబడ్డారు. వీరంతా ఎలా పెద్ద మనుషులు అయిపోయారు అంటూ నిట్టూర్చారు. అయితే ఇప్పటికే జనసేన దీనిపై ప్రకటన జారీ చేసి ఉంది. అయితే ఇప్పుడు రాయపాటి అరుణ రూపంలో కామెంట్స్ వ్యక్తం కావడంతో.. తెలంగాణ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
తెలంగాణ అంటే జనసేనకు అంత లోకువగా కనపడుతోందా?
దిష్టి అనేది పెద్ద తప్పు కాదు అంటూ తెలంగాణ నాయకులపై పరోక్షంగా సెటైర్లు వేసిన జనసైనికురాలు pic.twitter.com/NKUCBS8eSL
— greatandhra (@greatandhranews) December 2, 2025