HomeతెలంగాణJagtial extreme heatwave: తెలంగాణ నిప్పుల కొలిమి.. మండుతున్న జగిత్యాల!

Jagtial extreme heatwave: తెలంగాణ నిప్పుల కొలిమి.. మండుతున్న జగిత్యాల!

Jagtial extreme heatwave: తెలంగాణ వారం రోజులుగా నిప్పుల కొలిమిలా మారింది. మే ప్రారంభం నుంచి భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 9 గంటల నుంచే వేడి సెగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్నానికి మంటలు పుట్టిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు వేడి తీవ్రత కొనసాగుతోంది. దీంతో మూగజీవాలు అల్లాడుతున్నాయి. పంట పొలాల్లో అగ్గి రాజుకుంటోంది. ఇక మనుషులు అల్లాడిపోతున్నారు. ఎండకు తోడు వేడి గాలులు వీస్తుండడంతో వడదెబ్బబారిన పడుతున్నారు.

కరీంనగర్‌ నిప్పుల కుంపటి..
భానుడి భగభగలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. సోమవారం జగిత్యాల జిల్లా గుల్లకోటలో 45.7 డిగ్రీల సెల్సియస్‌ అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవగా, అల్లీపూర్‌లో 45.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ తీవ్రమైన వేడిమి ప్రజల జీవనశైలిని అతలాకుతలం చేస్తోంది.

రెడ్‌ జోన్‌లో ఉమ్మడి జిల్లా..
కేవలం జగిత్యాల జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాజన్న సిరిసిల్ల మర్థనపేటలో 44.7 డిగ్రీలు, పెద్దూరులో 43.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లి, ఎలిగేడు ప్రాంతాల్లో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లా గుండిలో 44.2 డిగ్రీలు, జమ్మికుంటలో 44.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

అప్రమత్తంగా ఉంటాలని హెచ్చరిక..
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రానున్న రోజుల్లోనూ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున, ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగినంత నీరు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper