spot_img
HomeతెలంగాణTelangana Election Results 2023: రేవంత్‌ ఇంటికి డీజీపీ.. క్యూ కడుతున్న ఐపీఎస్‌లు..

Telangana Election Results 2023: రేవంత్‌ ఇంటికి డీజీపీ.. క్యూ కడుతున్న ఐపీఎస్‌లు..

Telangana Election Results 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్‌ పూర్తిగా కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. హస్తం హవా కొనసాగుతోంది. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో అధికారుల వైఖరిలో మార్పు వస్తోంది. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు అనుకూలంగా ఉన్న పోలీసులు ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

రేవంత్‌ ఇంటికి అంజనీ కుమార్‌..
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను అంచనా వేస్తూ పోలీసులు అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగారాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ కొద్దిసేపటి క్రితం రేవంత్‌ ఇంటికి వెళ్లారు. ఆయతోపాటు చాలా మంది ఐపీఎస్‌లు కూడా రేవంత్‌ ఇంటికి క్యూ కట్టడం ఆసక్తిగా మారింది.

2004లో వైఎస్సార్‌ ఇంటికి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అంతకుముందు సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్‌.రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి పాయాత్ర చేశారు. సుమారు 3 వేల కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నడిచారు. దీంతో 2004 ఎన్నికల్లో ఫలితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. వైఎస్సార్‌ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు తెలుగు ప్రజలు పట్టం కట్టారు. ఈ సదర్భంగా నాటి పోలీస్‌ అధికారులు కూడా ఎన్నికల ఫలితాలు వస్తుండగానే సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్సార్‌ ఇంటికి అప్పటి డీజీపీ నాగేందర్‌ కుమార్‌ వెళ్లారు. తాజాగా ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ పోలీసులు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.

హంగామా..
కాగ్రెస్‌ తెలంగాణలో దూసుకుపోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో హంగామా కొట్లాడుతుంది. అంతటా సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు కూడా పోలింగ్‌ సరళిని అంచనా వేస్తున్నారు. గతంలో రేవంత్‌ పోలీసులను, డీజీపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో ఆయన ఇంటికి ఐసీఎస్‌లు, ఐఏఎస్‌లు క్యూ కట్టడం ఆసక్తిగా మారింది.

రేవంత్‌ ఇంటికి వెళ్లడంపై భిన్నాభిప్రాయం..
ఇక డీసీపీ అజనీకుమార్, ఐసీఎస్‌లు రేవంత్‌ ఇంటికి వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌ కేవలం పీసీసీ చీఫ్‌ మాత్రమే అని, ఆయన ఇంటికి డీజీపీ, ఐపీఎస్‌లు వెళ్లడం ఏంటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఎల్పీ నేతగా ఎన్నిక కాకపోయినా, అధికారిక హోదా లేకపోయినా, కేవలం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేత ఇంటికి వెళ్లడాన్ని తప్పు పడుతున్నారు. 2004లో కూడా ఇలాగే పోలీసులు వెళ్లారని, ఇప్పుడు వెళితే తప్పేంటని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ప్రజా అభిమానాన్ని పొందితే ఎవరైనా తిరుగులేని నాయకుడే అని పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ డైరెక్టర్ తో సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాడుగా…

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ ఐడెంటిటిని కాపాడుకుంటూ స్టార్ హీరోల రేంజ్ లో ముందుకు దూసుకు వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరు వాళ్లను వాళ్ళు...
Oktelugu Epaper