Raksha Bandhan 2025: ప్రతి శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో రక్షాబంధన్ ఒకటి. ఈ ఏడాది ఆగస్టు 9న రాఖీ పండుగ జరుపుకోనున్నారు. ఇప్పటికే సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు సిద్ధమయ్యారు. రాఖీ కట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా తమ సోదరుల ఇంటికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే రాఖీ పండుగ జరుపుకునే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని పండితులు చెబుతున్నారు. రాఖీ పండుగ ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా జీవితాంతం వీరు కలిసి ఉండేలా ఈ పండుగ చేస్తుంది అని అంటున్నారు. అలాంటప్పుడు ఈ పండుగ నిర్వహించే సమయంలో కొన్ని పాటించడం వల్ల మరింత సంతోషంగా ఉండగలుగుతారని చెబుతున్నారు. మరి ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Also Read: రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు
సాధారణంగా రాఖి కట్టేవారు మార్కెట్లోకి వెళ్లి రాఖీలను కొనుగోలు చేసి తమ సోదరులకు కడుతూ ఉంటారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం రకరకాల రంగులు, డిజైన్లతో కూడిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని రకాల రాఖీలు మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. కొందరు దేవుళ్ళ ఫోటోలు ఉన్న రాఖీలను కొనుగోలు చేస్తారు. అయితే ఇలాంటి రాఖీలు కట్టడం వల్ల ఒక్కోసారి దేవుళ్ళ ఫోటోలు ఉన్న చేతులతో ఏవైనా పనులు చేస్తే ఆశుభం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల దేవుళ్ళ ఫోటోలు ఉన్నా రాఖీలను కట్టకుండా ఉండడమే మంచిది.
అలాగే కొన్ని రాశుల వారికి కొన్ని రకాల రంగుల రాఖీలు కట్టడం వల్ల మరింత మంచి జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు తమ సోదరుడిది ఏ రాశినో తెలుసుకొని వారికి అనుకూలంగా ఉండే రంగు రాఖీలను తీసుకోవాలని చెబుతున్నారు. తమ సోదరుడిది మేష రాశి అయితే ఎరుపు రంగు రాఖీ కట్టాలని అంటున్నారు. వృషభ రాశి అయితే నీలం రంగు రాఖీ.. మిథునం, కన్యరాశుల వారికి ఆకుపచ్చ రాఖీలు కట్టాలని అంటున్నారు. అలాగే కర్కాటక రాశి వారికి తెలుపు, సింహరాశి వారికి ఆరెంజ్, తులా రాశి వారికి తెలుపు లేదా లైట్ బ్లూ, వృశ్చిక రాశి వారికి ఎరుపు, ధనుస్సు రాశి వారికి పసుపు, మకర, కుంభ రాశి వారికి నీలం, మీనం రాశి వారికి పసుపు కలర్ రాఖీ కట్టడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
అయితే రాఖీ కట్టే సమయంలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలని పండితులు చెబుతున్నారు. రాఖీ కట్టే సమయంలో సోదరుడు తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోవాలని.. అందుకు అభిముఖంగా ఉండి సోదరీమణులు తమ రాఖీ కట్టాలని చెబుతున్నారు. ఈ రెండు దిశలు కాకుండా వేరే దిశలో కూర్చుని ఉండడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా దేవుడి గదికి దగ్గరగా సోదరుడు కూర్చొని రాఖీ కట్టించుకోవాలని చెబుతున్నారు.
రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు పుట్టింటికి వస్తుంటారు. దీంతో వారి ఇల్లు ఈరోజు సంతోషంగా గడిచే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి ఆందోళనకరమైన వాతావరణం లేకుండా చూడాలి. ఈరోజు సంతోషంగా ఉండడంతో అన్నాచెల్లెళ్ల మధ్య జీవితాంతం ఎలాంటి గొడవలు లేకుండా ఉంటాయని చెబుతున్నారు.