YS Jagan Sharmila Rakhi: సోదర బంధానికి ప్రతీక రక్షాబంధన్( Raksha Bandhan ). ఎంత దూరంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. రక్షాబంధన్ నాడు సోదరి, సోదరులు కలుసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. రాఖీ కట్టి నిండు మనసుతో సోదరుడిని ఆశీర్వదించడం.. సోదరిని దీవించడం చేస్తుంటారు. ఒకరి హితం కోసం మరొకరు కోరుకుంటారు. ఇంతటి రక్షాబంధన్ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. తమ శక్తి కొలది ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే రక్షాబంధన్ వచ్చిందంటే చాలు అందరి చూపు ప్రముఖులపై ఉంటుంది. సెలబ్రిటీల వైపు ఎక్కువ మంది చూస్తారు. వివిధ కారణాలతో వివాదాల్లో చిక్కుకున్న వారి వైపు ఆసక్తిగా చూస్తారు. ఇప్పుడు ఏపీలో అందరి చూపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి, పిసిసి చీఫ్ వైయస్ షర్మిలపై ఉంది. కానీ వారిద్దరికీ సంబంధించి రక్షాబంధన్ అప్డేట్ ఏవి బయటకు రాకపోవడం విశేషం.
Also Read: చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి.. నిజం ఎంత?
కుటుంబంలో కొరవడిన ఐక్యత..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) కుటుంబం ఐక్యతకు మారుపేరు. చిన్నపాటి వేడుకనైనా ఘనంగా జరుపుకుంటుంది ఆ కుటుంబం. అటువంటిది గత కొద్ది రోజులుగా ఆ కుటుంబంలో వేడుకలు జరుగుతున్నాయి. కానీ ఐక్యత మాత్రం కనిపించడం లేదు. వివేకానంద రెడ్డి హత్యతో ఆ కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. కుటుంబంలో ఆర్థిక చిచ్చురావడంతో సోదరుడు జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు షర్మిల. అలా క్రమేపి వారి మధ్య దూరం రాజకీయ వైరం గా మారిపోయింది. పిల్లలిద్దరి మధ్య తలెత్తిన విభేదాలతో సతమతం అవుతున్నారు విజయమ్మ. కానీ షర్మిల వైపు కొద్దిపాటి మొగ్గు చూపిస్తున్నారు. అయితే క్రమేపి పిల్లలిద్దరి మధ్య అగాధం పెరిగిపోయింది. రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
Also Read: విశాఖ టు భోగాపురం.. నాలుగు టౌన్ షిప్ లు.. ఎన్ని ఉద్యోగాలో తెలుసా?
ఎటువంటి ప్రకటన లేదు..
రాష్ట్రంలో సోదరీమణులందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కానీ తన సోదరి షర్మిల( Y S Sharmila) ఆయనకు రాఖీ కట్టకపోవడం విశేషం. వారి మధ్య పండుగలు, వివాహాలు, కుటుంబ వేడుకలు సైతం నిలిచిపోయాయి. షర్మిల కుమారుడి వివాహానికి సైతం జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాల తరువాత, ప్రస్తుతం సైతం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు షర్మిల. రోజురోజుకు వారి మధ్య బంధం దూరమవుతూ వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రక్షాబంధన్ నాడు వారిద్దరూ కలవడం అనేది జరగని పని అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి షర్మిల రాఖీ కట్టారని కానీ.. శుభాకాంక్షలు తెలిపారని కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. సో ఈ ఏడాది రక్షాబంధన్ కూడా వైయస్సార్ కుటుంబాలకు నిరాశనే మిగిల్చింది.