Homeఆంధ్రప్రదేశ్‌Professor Nageshwar Controversy: కేసు నమోదయింది.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం ఏ మలుపు తీసుకుంటుంది

Professor Nageshwar Controversy: కేసు నమోదయింది.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం ఏ మలుపు తీసుకుంటుంది

Professor Nageshwar Controversy: ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. రాజకీయ పరమైన అంశాలు.. అభివృద్ధి పరమైన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సుమారు 25 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జరిగింది ఒకటైతే.. బయటికి వచ్చింది మరొకటి. ముఖ్యంగా ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వీరి భేటీ పై తనదైన వ్యాఖ్యానం చేశారు. […]

Professor Nageshwar Controversy: ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. రాజకీయ పరమైన అంశాలు.. అభివృద్ధి పరమైన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సుమారు 25 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జరిగింది ఒకటైతే.. బయటికి వచ్చింది మరొకటి. ముఖ్యంగా ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వీరి భేటీ పై తనదైన వ్యాఖ్యానం చేశారు.

జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్టు.. దానికి అమిత్ షా ఒప్పుకోన్నట్టు.. పైగా జగన్మోహన్ రెడ్డిని లాంగ్ టర్మ్ పొలిటికల్ ఫ్రెండ్ అని అమిత్ షా వ్యాఖ్యానించినట్టు నాగేశ్వర్ చెప్పుకొచ్చారు.. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను వైసిపి విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. నిన్నటి నుంచి అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో దీని గురించి విపరీతమైన చర్చలు నడుపుతోంది.. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో సింపతిని కలగజేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు నిన్న నాగేశ్వర్ వ్యాఖ్యలు చేయడం.. ఈరోజు జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడటం.. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి మందు కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఆగ్రహంగా మాట్లాడారని.. ఆ తర్వాత వైఎస్ కన్నుమూశారని.. జగన్ మాట్లాడారు.. దీంతో ఏపీ రాజకీయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..

నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన నాయకులు సోషల్ మీడియాలో.. మీడియాలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ అమ్ముడుపోయారని.. ఊహాజనితమైన విషయాలను చెబుతున్నారని.. తద్వారా ప్రజలలో అశాంతి కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగేశ్వర్, ఆయన మాట్లాడిన మాటలను టెలికాస్ట్ చేసిన ఛానల్ మీద పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లాలోని ఇంద్ర పాలెం పోలీస్ స్టేషన్లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నాగేశ్వర్ కు సూచించారు. మరోవైపు నాగేశ్వర్ మీద ఫిర్యాదు దాఖలైన నేపథ్యంలో.. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది..

నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల పట్ల అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే రాజకీయంగా జరిగిన భేటీలో చర్చకు రాని విషయాలను ప్రస్తావించడం నాగేశ్వర్ లాంటి వ్యక్తులకు సరికాదని జనసేన నాయకులు అంటున్నారు.. మరోవైపు కూటమి ప్రభుత్వం నాగేశ్వర్ పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు టిడిపి సోషల్ మీడియా కూడా నాగేశ్వర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.. నాగేశ్వర్ వైసీపీ కండువా కప్పుకున్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దీంతో నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల వివాదం మరో మలుపుతీసుకుంది. అయితే ఇది ఎక్కడదాకా వెళ్తుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper