Homeఆంధ్రప్రదేశ్‌August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 రోజులు సెలవులు రానున్నాయి ఈ ఆగస్టు నెలలో. ఆదివారాలతో కలుపుకొని దాదాపు పది రోజుల వరకు సెలవులు రానున్నాయి. రెండో శనివారం తో పాటు ఆగస్టు 15, వరలక్ష్మీ వ్రతం, రాఖీ, మిలాద్ ఉన్ నబి వంటి సెలవులు […]

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 రోజులు సెలవులు రానున్నాయి ఈ ఆగస్టు నెలలో. ఆదివారాలతో కలుపుకొని దాదాపు పది రోజుల వరకు సెలవులు రానున్నాయి. రెండో శనివారం తో పాటు ఆగస్టు 15, వరలక్ష్మీ వ్రతం, రాఖీ, మిలాద్ ఉన్ నబి వంటి సెలవులు ఉన్నాయి. వీటితో పాటుగా ఉద్యోగులకు అప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఆగస్టు నెలలో ఏకంగా 5 ఆదివారాలు వచ్చాయి. ఒక రెండో శనివారం వచ్చింది. మిగతావి పండుగల రూపంలో సెలవులు వచ్చాయి విద్యార్థులకు.

* 21 రోజులు పని దినాలు..
ఆగస్టులో మొత్తం 31 రోజులు ఉన్నాయి. అందులో పది రోజులు సెలవులు రావడం విశేషం. ఈ లెక్కన ఈ నెలలో పాఠశాలలు 21 రోజు మాత్రమే పని చేస్తాయి. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆపై వరలక్ష్మీ వ్రతం రూపంలో సెలవు రానుంది.
* ఆగస్టు 2 సాధారణ ఆదివారం
* ఆగస్టు 8 రెండో శనివారం
* ఆగస్టు 9 సాధారణ ఆదివారం
* ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జండా వందనం
* ఆగస్టు 16 సాధారణ ఆదివారం
* ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం
* ఆగస్టు 23 సాధారణ ఆదివారం
* ఆగస్టు 25 మంగళవారం మిలాద్ ఉన్ నబి సెలవు దినం
* ఆగస్టు 30న సాధారణ ఆదివారం

* విశాఖలో అదనంగా రెండు రోజులు..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ, సంబంధిత సంస్థలు సెలవుల అమలుకు సంబంధించి విడుదల చేసే అధికారిక ఉత్తర్వులు మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే విశాఖ జిల్లా సింహాచలంలో జరిగే వార్షిక గిరి ప్రదక్షిణ సందర్భంగా పాఠశాలలతో పాటు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. గిరి ప్రదక్షిణ నిర్వహణ దృష్ట్యా జూలై 28, 29 తేదీల్లో ప్రదక్షణ మార్గంలో ఉన్న 221 స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్ల దృష్ట్యా విద్యాసంస్థలకు ఆ రెండు రోజులు సెలవులను ప్రకటించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper