spot_img
HomeతెలంగాణCM Revanth Reddy: డిప్యూటేషన్ పై సీఎం రేవంత్ ఓఎస్డీగా వస్తోన్న అజిత్ రెడ్డి ఎవరు?...

CM Revanth Reddy: డిప్యూటేషన్ పై సీఎం రేవంత్ ఓఎస్డీగా వస్తోన్న అజిత్ రెడ్డి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓఎస్డీగా బి.అజిత్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీసెస్‌కు చెందిన ఆయన ఐదేళ్లపాటు డిప్యుటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయనున్నారు. ఆయనను ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అజిత్‌రెడ్డి 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో ఆగ్రా, సికింద్రాబాద్‌ కంటోన్మెట్‌ బోర్డుల్లో పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్‌ ఎస్టేట్‌ అధికారిగా పనిచేస్తున్నారు.

ఎవరీ అజిత్‌ రెడ్డి?
ఇండియన్‌ డిఫెన్స్‌ సర్వీస్‌కు చెందిన అజిత్‌రెడ్డి గతంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అధికారిగా పనిచేశారు. అలాగే ఆగ్రా కంటోన్మెంట్‌లోనూ పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్‌ ఎస్టేట్‌ అధికారిగా పనిచేస్తున్నారు. ఇలా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న ఆయన డిప్యుటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేయనున్నారు.

కేంద్ర సర్వీసుల్లో వారికి ప్రాధాన్యం..
ఇక కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న మరికొందరు అధికారులను కూడా తన టీమ్‌ లో చేర్చుకోవాలని రేవంత్‌ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇద్దరు అదనపు బ్యూరోక్రాట్‌లను సెక్రెటరీలుగానియమించాలని భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మాజీ కమిషనర్‌ లోకేష్‌కుమార్, మాణిక్కరాజ్‌ సీఎంవో అదనపు సెక్రెటరీలుగా నియమించాలని చూస్తున్నారు. లోకేశ్‌కుఆర్‌ను రిలీవ్‌ చేయడానికి ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్‌ పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో పనిచేస్తున్న మాణిక్కరాజ్‌ను రాష్ట్రానికి రప్పించాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper