HomeతెలంగాణACB raids Narahari house: రెవెన్యూ అధికారి అయితే ఇంత దోచుకోవచ్చా.. తెలంగాణలో ఏంటి అవినీతి...

ACB raids Narahari house: రెవెన్యూ అధికారి అయితే ఇంత దోచుకోవచ్చా.. తెలంగాణలో ఏంటి అవినీతి తిమింగలాలు..

ACB raids Narahari house: కేవలం రెండు సంవత్సరాలు.. 441 కేసులు.. ఇదేదో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ లో నమోదు చేసిన కేసులు కాదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నమోదు చేసిన కేసులు కాదు. తెలంగాణలో ఏసీబీ ఆఫీసర్లు కరప్షన్ కు పాల్పడుతున్న అధికారుల మీద నమోదు చేసిన కేసులు. పైగా వీరిలో చాలామంది లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటే ట్రాప్ చేస్తున్నారు. అక్రమంగా ఆస్తులను కూడ పెడితే […]

ACB raids Narahari house: కేవలం రెండు సంవత్సరాలు.. 441 కేసులు.. ఇదేదో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ లో నమోదు చేసిన కేసులు కాదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నమోదు చేసిన కేసులు కాదు. తెలంగాణలో ఏసీబీ ఆఫీసర్లు కరప్షన్ కు పాల్పడుతున్న అధికారుల మీద నమోదు చేసిన కేసులు. పైగా వీరిలో చాలామంది లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటే ట్రాప్ చేస్తున్నారు. అక్రమంగా ఆస్తులను కూడ పెడితే రైడ్ చేస్తున్నారు. 2024 నుంచి ఇప్పటివరకు ఏకంగా 441 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇంత స్థాయిలో కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అవినీతి అధికారులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. ఇటీవల కాలంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న రాము నాయక్ అనే అధికారిని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. అతడు ఏకంగా ప్రభుత్వ భూములను ఇతర వ్యక్తులకు అక్రమంగా పట్టా చేయించాడు. దీనికోసం భారీగా లంచం తీసుకున్నాడు. ఇటీవల మోహన్ నాయక్ అనే అధికారి 100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టిన నేపథ్యంలో.. అతని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతి అధికారుల మీద ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారి ప్రవర్తన మారడం లేదు. ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఒక ఎంపీడీవో, ఎంపీవో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు. పైగా ఆ మహిళా అధికారి తన కుమారుడిని కూడా వసూళ్లకు ప్రత్యేకంగా నియమించుకోవడం విశేషం. ఏసీబీ అధికారుల తనిఖీలు ఆ ఎంపీడీవో, ఎంపీవో పట్టుబడిన నేపథ్యంలో.. అక్కడి ప్రజలు పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

అవినీతి అధికారులు రోజురోజుకు ప్రజల మీద పడి దోచుకుంటున్నారు. ఏదైనా పని ఉందని వెళ్తే.. మొహమాటం లేకుండా ఏమిస్తామని అడుగుతున్నారు. తాజాగా ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అతడికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. పాతబస్తీలోని ఛత్రినాక ప్రాంతంలో అతడి నివాసం.. కార్యాలయం.. బంధువుల గృహాలలో తనిఖీలు చేపట్టారు. నరహరి ఇంట్లో ఏకంగా 1.10 కోట్ల నగదును గుర్తించారు. ఇవే కాక బంగారు ఆభరణాలు.. ఇతర రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో అతడికి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో పెద్దపెద్ద ఆఫీసర్లను ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకుంటున్నప్పటికీ. అవినీతి అధికారులు తమ ధోరణి మార్చుకోవడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper