iQOO 15T 5G price in India: నేటి కాలంలో మొబైల్ ఫోన్ వాడేవారు ఎక్కువగా ఫ్లాగ్ ఫిష్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం iQOO కంపెనీ నుండి iQOO 15T 5G త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. చైనా మార్కెట్లో ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్లు, లీక్స్ హల్చల్ చేస్తుండగా, త్వరలోనే ఈ మొబైల్ ఇండియాలో కూడా లాంచ్ కానుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
iQOO 15T 5G స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో రానుంది. 2K రిజల్యూషన్ తో 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ ఉండడం వల్ల ఈ ఫోన్ లో గేమింగ్ ఆడేటప్పుడు, స్క్రోలింగ్ చేసేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ వరకు ఉండడంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ప్రీమియం లుక్ కోసం మెటల్ ఫ్రేమ్, భద్రత కోసం స్క్రీన్ కింద ఫాస్ట్ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం దీనికి IP68 రేటింగ్ కూడా ఉంది.
ఈ మొబైల్‌లో సరికొత్త MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3nm ఆర్కిటెక్చర్‌పై పనిచేసే అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్. దీనికి తోడు iQOO స్వయంగా డెవలప్ చేసిన Q3 గేమింగ్ చిప్ కూడా ఇందులో ఉండబోతోంది. దీంతో ‘గెన్‌షిన్ ఇంపాక్ట్’ వంటి భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్‌ను కూడా ఎలాంటి లాగ్స్ లేకుండా, తక్కువ పవర్ వినియోగంతో రన్ చేయగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
ఈ కొత్త మొబైల్ లో ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ప్రధాన కెమెరా 200MP సెన్సార్‌తో వస్తోంది. దీంతో ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తాయి. దీని ద్వారా 8K వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ఇక 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు.
ఇందులో అతిపెద్ద హైలైట్ బ్యాటరీ. iQOO 15T లో ఏకంగా 8,000mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని ప్యాక్ చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సులభంగా రెండు నుండి మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని లీక్స్ చెబుతున్నాయి. ఇంత పెద్ద బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడం కోసం 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు.
లీక్ అయిన సమాచారం ప్రకారం.. చైనా మార్కెట్ ధరల ఆధారంగా చూస్తే, బేస్ వేరియంట్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర ఇండియాలో సుమారు రూ. 58,000 నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఇందులో టాప్-ఎండ్ మోడల్ 16GB RAM మరియు 1TB స్టోరేజ్ వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఫోన్ల కంటే మీడియాటెక్ చిప్‌సెట్ ఫోన్ల ధర కొంచెం తక్కువగా ఉంటుంది.
