
దేశంలో కరోనా మహమ్మారి ఎవరూ ఊహించని స్థాయిలో వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు పలు రాష్ట్రాల్లో అమలవుతున్న నేపథ్యంలో ప్రజల్లో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఎక్కువ సమయం సెల్ ఫోన్ వీక్షణకే ప్రజలు సమయం కేటాయిస్తున్నారు. డిజిటల్ అడిక్షన్ కొత్త జబ్బులకు కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.
యూట్యూబ్, సోషల్ మీడియా, ఓటీటీలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్న వాళ్లకు కండరాలకు సంబంధించిన కొత్త జబ్బులు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి ఎక్కువ సమయం పట్టుకోవడం వల్ల చిటికెను వేలు వంకర పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకి ఆరుగంటలకు మించి చిటికెన వేలు మీద భారం పడితే ప్రమాదమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తల, భుజాన్ని గంటల తరబడి వంచి మొబైల్ ను చూస్తే టెక్స్ట్ నెక్ అనే సమస్య బారిన పడే అవకాశం ఉందని ఈ సమస్య బారిన పడిన వాళ్లు వెన్ను పైభాగం, భుజాలలో తీవ్రమైన నొప్పితో బాధ పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే చిన్న వయస్సులోనే కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అతిగా ఫోన్ కీపాడ్ వాడటం వల్ల బొటనవేలు నరాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మోచేతిని ఎక్కువసేపు మడిచి ఫోన్ మాట్లాడితే సెల్‌ఫోన్ ఎల్బో అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. నొప్పి, మంట, స్పర్శ లేకపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. పొడవుగా, వెడల్పుగా ఉండే ఫోన్ల వల్ల చేతి కండరాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.