లారీ డ్రైవర్, క్లీనర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో క్లీనర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ నైఫ్ రాజు, క్లీనర్ రాజు ఇరువురు నూకల లోడు కోసం కాకినాడ నుంచి కరీంనగర్ కు లారీపై వచ్చారు. కరీంనగర్ నుంచి తిరిగి వెళ్తుండగా ఖమ్మం జిల్లాలో వీరిద్దరి మధ్య ఘర్ష ణ జరిగింది. ఈ ఘర్షణలో డ్రైవర్ రాజు, క్లీనర్ ను కత్తితో హత్య చేశాడు. ఆ తరువాత మృత దేహాన్ని లారీలోనే వేసుకొని కొణిజర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోస్టుమార్టం నిమిత్తం క్లీనర్ మృత దేహాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Lorry cleaner murderd by driver in khammam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com