Karimnagar: పశువులు కామ వాంఛ తీర్చుకోవడానికి వెనుకాడవు.. వావి వరుసలను ఏమాత్రం పట్టించుకోవు. ఎందుకంటే అవి పశువులు కాబట్టి. కానీ మనుషులకు అలా కాదు.. మనుషులలో ఆత్మీయత ఉంటుంది. బంధాలలో గాఢత ఉంటుంది. అందువల్ల కామ వాంఛ తీర్చుకోవడంలో మనుషులు ఒక పరిధిని పాటించాల్సి ఉంటుంది.. కానీ రాను రాను పశువుల కంటే హీనంగా మనుషులు మారుతున్నారు.. ఒకరకంగా చెప్పాలంటే పశువుల కంటే దారుణంగా మారిపోతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో అంజయ్య అనే వ్యక్తి 15 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే స్వగ్రామంలో సరైన ఉపాధి లభించకపోవడంతో 2017లో తెలిసిన వారి ద్వారా వేరే దేశానికి వెళ్ళాడు. అక్కడ రెండు సంవత్సరాలపాటు పనిచేశాడు. చివరికి 2019లో స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతడు ఊహించని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తన భార్య తండ్రి లచ్చయ్యతో సన్నిహితంగా ఉండడం అంజయ్య గమనించాడు. ఈ క్రమంలో లచ్చయ్యను, తన భార్యను మందలించాడు. అయినప్పటికీ వారిద్దరి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇదే విషయాన్ని బంధువులకు కూడా చెప్పుకొని బాధపడ్డాడు.
అంజయ్య పదేపదే తమ బంధానికి అడ్డువస్తున్న నేపథ్యంలో తొలగించుకోవాలని లచ్చయ్య భావించాడు. కోడలితో కలిసి ప్రణాళిక రూపొందించాడు. సరిగ్గా మూడు నెలల క్రితం తన కుమారుడికి మందు పెట్టి చంపాలని అనుకున్నాడు. ఒకవేళ అతడు గనుక చనిపోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత సరిగ్గా నెల క్రితం గ్రామానికి చెందిన పులిపాక రవి అనే వ్యక్తిని లచ్చయ్య కలిశాడు. తన కుమారుడిని అంతం చేయాలని.. ఇందుకోసం మూడు లక్షలు ఇస్తానని ఒప్పందం కుదరచుకున్నాడు. ఈ క్రమంలో 1.25 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న రవి తనకు తెలిసిన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మహమ్మద్ అబ్రార్ తో కలిసి అంజయ్యను అంతం చేయడానికి పథకం రూపొందించాడు. ఈ క్రమంలో రవి, కోటేశ్వర్, అబ్రార్ అంజయ్య తో స్నేహం పెంచుకున్నారు. ప్రతిరోజు అతనికి మద్యం తాగించేవారు. ఈనెల 2న అంజయ్య ను గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించారు. ఆ తర్వాత అతని గొంతు నిలిమి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని కాలువలో పడేశారు.
అంజయ్య కనిపించడం లేదని భార్య, తండ్రి లచ్చయ్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల ఐదున అంజయ్య మృతదేహం కాల్వలో కనిపించింది.. ప్రమాదవశాత్తు అతడు అందులో పడి చనిపోయినట్టు నమ్మించడానికి లచ్చయ్య, అతడి కోడలు ప్రయత్నించారు. పోలీసులకు ఎక్కడో అనుమానం కలగడంతో వారు లోతుగా దర్యాప్తు చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతుండగానే సుపారి డబ్బు కోసం లచ్చయ్య ఇంటికి ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. దీంతో పోలీసులకు ఏం జరిగిందో అర్థమైంది. లచ్చయ్య, అతని కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. లచ్చయ్య, అతని కోడలు, కోటేశ్వర్, రవి, అబ్రార్ ను పోలీసులు జైలుకు తరలించారు.