Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీరూ.7 వేలకే రియల్ మీ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో..?

రూ.7 వేలకే రియల్ మీ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో..?

మనలో చాలామంది తక్కువ ఖర్చుతో మంచి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. తక్కువ బడ్జెట్ తో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వాళ్లకు రియల్ మీ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం 7వేల రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది రియల్ మీ సంస్థ రియల్ మీ సీ11ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ మొబైల్ కు కొనసాగింపుగా రియల్ మీ సంస్థ రియల్ మీ సీ11 (2021)ను విడుదల చేసింది.

ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ సింగిల్ కెమెరాను కలిగి ఉంది. 2జీబీ ర్యామ్, 32జీబీ మెమొరీతో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ ధర 6,999 రూపాయలుగా ఉంది. ఈ ఫోన్ ను కొనుగోలు చేయలని భావించే వాళ్లు రియల్ మీ.కామ్ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. గతేడాది విడుదల చేసిన మోడల్ ధర మాత్రం 7,499 రూపాయలుగా ఉంది. ఆండ్రాయిడ్ 11తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

రియల్ మీ 2.0తో పని చేయడం ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత. ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ + డిస్ ప్లేను కలిగి ఉంది. ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉండగ వెనుక వైపు 8 ఎంపీ కెమెరా ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ వరకు పెంచుకునే వీలు ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. రివర్స్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఈ ఫోన్ కలిగి ఉంది.

ఓటీజీ కేబుల్ సహాయంతో ఈ ఫీచర్ ను వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. తక్కువ ఖర్చుతో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయడం మంచిదని చెప్పవచ్చు. రియల్ మీ ఫోన్ బడ్జెట్ తో పోలిస్తే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper