Homeలైఫ్ స్టైల్Hands Free Calling: మొబైల్ ను ముట్టుకోకుండా ఫోన్ చేయాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే చాలు..

Hands Free Calling: మొబైల్ ను ముట్టుకోకుండా ఫోన్ చేయాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే చాలు..

Hands Free Calling: ప్రస్తుత కాలంలో మొబైల్ లో చాలా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడ కీ ప్యాడ్ ఉన్న ఫోన్ ను ఇప్పుడు స్మార్ట్ గా వాడుతున్నారు. ఇదే సమయంలో మొబైల్ ను మట్టుకోకుండానే ఫోన్ చేయగలుగుతున్నారు. అయితే ఇది కేవలం గూగుల్ అందిస్తున్న Gemini యాప్ తోనే సాధ్యం అవుతుంది. సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవంగా మారిన ఈ ఏఐ (AI) అసిస్టెంట్, మీ రోజువారీ మొబైల్ అవసరాలను ఎంతో సులభతరం చేస్తుంది. చేతితో […]

Hands Free Calling: ప్రస్తుత కాలంలో మొబైల్ లో చాలా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడ కీ ప్యాడ్ ఉన్న ఫోన్ ను ఇప్పుడు స్మార్ట్ గా వాడుతున్నారు. ఇదే సమయంలో మొబైల్ ను మట్టుకోకుండానే ఫోన్ చేయగలుగుతున్నారు. అయితే ఇది కేవలం గూగుల్ అందిస్తున్న Gemini యాప్ తోనే సాధ్యం అవుతుంది. సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవంగా మారిన ఈ ఏఐ (AI) అసిస్టెంట్, మీ రోజువారీ మొబైల్ అవసరాలను ఎంతో సులభతరం చేస్తుంది. చేతితో పట్టుకునే పనిలేకుండా, కేవలం మీ వాయిస్ కమాండ్స్‌తోనే మొబైల్‌లోని వివిధ ఫీచర్లను నియంత్రించే అద్భుతమైన సదుపాయాన్ని ఇది కల్పిస్తోంది. దీని కోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో జెమిని యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అదెలాగో చూద్దాం..

మొబైల్‌లో Gemini ai ఉంటే చాలు.. ఏ యాప్‌నైనా చిటికెలో ఓపెన్ చేయవచ్చు. ఉదాహరణకు వంట చేస్తున్నప్పుడో లేదా మరేదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడో “Open YouTube” అనో లేదా “Open WhatsApp” అనో చెబితే చాలు, జెమిని వెంటనే ఆ యాప్‌ను స్క్రీన్‌పై ఓపెన్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ వైపు చూడాల్సిన లేదా చేతులతో వెతకాల్సిన అవసరం లేకుండానే మీ పనులు జరిగిపోతాయి.

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు సైతం లేదా చేతులు ఖాళీగా లేనప్పుడు ఎవరికైనా అత్యవసరంగా కాల్ చేయాల్సి వస్తే జెమిని యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. Call [వ్యక్తి పేరు] అని చెబితే చాలు, మీ కాంటాక్ట్స్ లిస్ట్ నుండి వారి నంబర్‌ను వెతికి ఆటోమేటిక్‌గా కాల్ కనెక్ట్ చేస్తుంది. దీనికోసం మీరు ఫోన్‌ను చేతిలోకి తీసుకోనక్కరలేదు, లాక్ స్క్రీన్ పై నుండే (సెట్టింగ్స్ అనుమతిస్తే) ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

గూగుల్ సెర్చ్ ఇంజిన్ సామర్థ్యంతో పనిచేసే జెమిని యాప్, బ్రౌజింగ్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. మీకు ఏదైనా సమాచారం కావాలన్నా, లేటెస్ట్ వార్తలు తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా వంటకం రెసిపీ కావాలన్నా కేవలం నోటితో అడిగితే సరిపోతుంది. ఇది క్షణాల్లో ఇంటర్నెట్ నుండి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తుంది. కేవలం సమాచారమే కాదు, మీకు నచ్చిన భాషలోకి టెక్స్ట్‌ను అనువదించడం (Translation), ఈమెయిల్స్ రాయడం వంటి పనులను కూడా ఇది సులువుగా చేస్తుంది. అయితే ఇలా కావాలంటే కొన్ని జెమిని ఏఐ ఓపెన్ ఇన్ స్టాల్ చేసిన తరువాత ఈ సెట్టింగ్స్ న మార్చుకోవాలి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో పాత గూగుల్ అసిస్టెంట్ స్థానంలో ఇప్పుడు జెమిని డిఫాల్ట్ అసిస్టెంట్‌గా మారుతోంది. కేవలం పవర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా లేదా “Hey Google” అని పలకరించడం ద్వారా దీనిని యాక్టివేట్ చేయవచ్చు. అలాగే Gemini Live ఫీచర్ ద్వారా మీరు ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా జెమినీతో సహజమైన సంభాషణలు సాగించవచ్చు, మధ్యలో అడ్డుపడి సరికొత్త ప్రశ్నలు కూడా అడగవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా మార్చుకోవడానికి ఈ యాప్ ఒక చక్కని ఆప్షన్.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper