AOT Movie: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ENE రిపీట్’ చిత్రం మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది. వీకెండ్ లోనే దాదాపుగా 80 శాతం కి పైగా రీకవరీ ని సాధించిన ఈ చిత్రం, మొదటి సోమవారం రోజున కాస్త తడబడింది. హైదరాబాద్, ఓవర్సీస్ లో తప్ప, మిగిలిన ప్రాంతాల్లో భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. మరోవైపు ఈ సినిమాతో పాటుగా విడుదలైన ‘ఆకాశం లో ఒక తార’ చిత్రానికి మొదటి రోజు ఓపెనింగ్స్ పెద్దగా రాకపోయినా, రెండవ రోజు నుండి వసూళ్లు బాగా పికప్ అయ్యింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటి సోమవారం రోజున ‘ENE రిపీట్’ కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యాయట.
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కలు ప్రకారం చూస్తే ,’ENE రిపీట్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 5 వ రోజున 2 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి 2 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా 4 రోజుల్లో ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 6 కోట్ల 16 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా సీడెడ్ ప్రాంతం లో 1 కోటి గ్రాస్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లో 4 కోట్ల 24 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 6 రోజుల్లో 11 కోట్ల 43 లక్షల రూపాయిల గ్రాస్ రాగా, 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 2 కోట్ల 30 లక్షలు, కేరళ నుండి 4 కోట్ల 20 లక్షలు, తమిళనాడు + రెస్ట్ ఆఫ్ నదియా నుండి 1 కోటి 55 లక్షలు, ఓవర్సీస్ నుండి 8 కోట్ల 45 లక్షలు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 28 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 13 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే ఈ సినిమా మరో 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.