Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీMobile Tempered Glass: మొబైల్ టెంపర్డ్ గ్లాస్, బ్యాక్ కవర్ ఫ్రీ ఫ్రీ... ఎక్కడో తెలుసా..?

Mobile Tempered Glass: మొబైల్ టెంపర్డ్ గ్లాస్, బ్యాక్ కవర్ ఫ్రీ ఫ్రీ… ఎక్కడో తెలుసా..?

Mobile Tempered Glass: నేటి కాలంలో చాలా అవసరాలకు మొబైల్ తప్పనిసరిగా మారింది. కొందరు తక్కువ ధరలో మొబైల్స్ కొంటె మరికొందరు ఖరీదైన డివైస్ లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మొబైల్ ఏదైనా దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఇది కింద పడిపోవడం లేదా క్రాక్ రావడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో మొబైల్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లోనూ మొబైల్ సేఫ్ గా […]

Mobile Tempered Glass: నేటి కాలంలో చాలా అవసరాలకు మొబైల్ తప్పనిసరిగా మారింది. కొందరు తక్కువ ధరలో మొబైల్స్ కొంటె మరికొందరు ఖరీదైన డివైస్ లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మొబైల్ ఏదైనా దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఇది కింద పడిపోవడం లేదా క్రాక్ రావడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో మొబైల్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లోనూ మొబైల్ సేఫ్ గా ఉండాలంటే దీనికి బ్యాక్ సైడ్ కవర్.. ఫ్రంట్ సైడ్ టెంపర్డ్ గ్లాస్ వేసుకోవాలి. చాలామంది వీటిని ధరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని మొబైల్స్ కంపెనీలు ఇవి ఉచితంగా ఇస్తున్నాయి. ఆ కంపెనీలు ఏవో ఇప్పుడు చూద్దాం..

చైనాకు చెందిన ఒప్పో, వివో, రియల్ మీ ఫోన్లు భారతదేశంలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ఈ మొబైల్స్ కొనుగోలు చేసినప్పుడు చాలామంది వెంటనే బ్యాక్ సైడ్ కవర్, ఫ్రంట్ సైడ్ టెంపర్డ్ గ్లాస్ వేసుకుంటారు. ఇవి వేసుకోవడం వల్ల ఫోన్ కిందపడినా.. గ్లాస్ పై క్రాక్ వచ్చిన అసలైన ఫోన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వీటికి ప్రత్యేకంగా చార్జ్ అవుతుంది. సాధారణ క్వాలిటీవి అయితే రూ.200 లోపే వస్తాయి. కానీ బ్రాండెడ్ కావాలంటే అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రెండింటిని ఇప్పుడు ఈ మూడు కంపెనీలు ఉచితంగానే అందిస్తున్నాయి. వీటిని ప్రత్యేక తేదీల్లో మాత్రమే అందిస్తారు.

ప్రతి నెలలో కొన్ని నిర్దిష్ట తేదీల్లో ఈ కంపెనీలు ఉచితంగా టెంపర్డ్ గ్లాస్ తో పాటు బ్యాక్ కవర్ ఇస్తున్నాయి.Vivo, iQOO కంపెనీలు ప్రతి నెలలో 14, 15, 16 తేదీల్లో వీటిని ఉచితంగా పొందవచ్చు. అలాగే OPPO కంపెనీ ప్రతి నెలలో 10, 11, 12 అనే మూడు తేదీల్లో వీటిని ఉచితంగా పొందవచ్చు. Realme మొబైల్ వినియోగదారులు ప్రతినెల మూడవ శనివారంలో ఈ సేవను పొందవచ్చు అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇవే కాకుండా చాలా వరకు ఈ కంపెనీలు కొన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. వీటిలో స్పీకర్ క్లీనింగ్ వంటివి కూడా ఉచిత సేవను అందిస్తాయి. లేబర్ చార్జీలు కూడా కొన్ని కంపెనీలు ఉచితంగా అందిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ఫోన్ సర్వీస్ చేసిన తర్వాత నచ్చకపోతే నిర్నిత తేదీల్లో తిరిగి దానిని సర్వీస్ చేసుకుని అవకాశం కూడా ఉంటుంది. ఈ మొబైల్స్ కలిగి ఉన్నవారు సమీపంలోని సెంటర్ లోకి వెళ్లి ఈ సేవలను పొందవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper